పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

గోన గన్నా రెడ్డి

కస్తూరితో, చందనంతో, పునుగు జవ్వాజులతో, కుంకుమపూవుతో పాటలవర్ణ విరాజిత పీనవక్షోజములపై మకరికాదిపత్రాల రచియింతురు. పద్మాలవలె ఎఱ్ఱనైన తమ పాదాలకు లత్తుకరంగుతో లతలు రచింతురు. మనోహరంగా విన్యసింపబడిన వివిధభూషణాలను ధరింతురు. యవ్వనవతులగు బాలికలు తమ వక్షోజాలను మరుగుపరచరు. వివాహంకాగానే పట్టుకంచుకాలు ధరిస్తారు.

ఉదయారుణకాంతిలా కోలమోములవారు, చంద్రబింబాలులా గుండ్రని మోములవారు, నల్ల కలువపత్రాలులా కాటుకకన్నులవారు, చకోరాలులా వాలు గన్నులవారు, పద్మములులా విశాలాక్షులు, అరమూతల మదిరాక్షులు, చూపులలో ఆర్ద్రత ఒలికించే కామాక్షులు, గన్నేరు మొగ్గలవంటి సమనాసికలవారు, నువ్వు పువ్వులవంటి ముక్కుపుటాలవారు, చిరువంపునాసాగ్రంకల చిలుకలకొలుకులు, ఇరికపళ్ళవంటి ఎఱ్ఱటిపెదవుల చిన్ననోరులవారు, విలువంపుతిరిగిన తేనెపెరవంటి అధరోష్ఠాలవారు, సముద్రతీరాలవంటి సెలయేటినడకలవంటి కనుబొమలవారు, తామరపూరేకులవంటి చెంపలుకలవారు, మామిడిపళ్ళవంటి చిబుకములవారు, లతల వంటి చంద్రకిరణాలవంటి చేతులుకలవారు, మందారమొగ్గలవంటి పడుచువారల కోర్కెలవంటి అంగుళులుకలవారు, లేతపొన్నమొక్కలలా ఊగే సన్ననికౌనులవారు, ఠీవికలవారు, ప్రేమకలవారు, చదువుకొన్నవారు, ఆకాశమునుంచి ఒలికే ఒడగండ్లవంటి స్వచ్ఛశీలంకలవారు, ఉషస్సువంటి, రాకాపూర్ణిమవంటి, లోతైన మంచినీళ్ళ చెరువువంటి, కమలములతో నిండిన చెరువునుండి వుదయంలో వచ్చే పరిమళంవంటి సౌందర్యంకలవారు ఆంధ్రసుందరాంగులా మందిరములో వారికి తలమానికమైన అన్నాంబిక ఆ వల్లకిపై పలికించే మనోహర గాంధర్వము వింటూ, గణపతి రుద్రదేవమహారాజు నిర్మించిన గుడిలోని ఉత్తమ శిల్పసుందరులులా సుందరభంగిమలు తాల్చినవారయిరి.

“మరలినవి చీకట్లు వరలె పులుగులపాట
 సురలతాంగి ఉషస్సు అరుదెంచె తూర్పులో
 మావిలో పికియోర్తు ఏవియో స్వప్నాల
 కావిరంగుల చిగురు తావులను మూర్కొనదు”

ఈ చరణాలు ఆ వనితాలోకానికి అగమ్యగోచరాలే అయినవి. ఏదియో మధుర ప్రపంచంమాత్రం వారికి దృశ్యాదృశ్యంగా గోచరించింది.

అన్నాంబిక నిట్టూర్పువదలి తన పీఠంమీదనుండి లేచింది. చెలికత్తెలు దారిచూప మహారాణియు, వధువును అభ్యంతరగృహాల కేగిరి. బంధుకాంతలందరు వారి వారి విడుదులకు వెళ్ళిపోయిరి.

తల్లీ కూతుళ్ళిద్దరూ అలంకారమందిరంలో ఆసనాలపై అధివసించగానే అన్నాంబిక సవిచారంగా తల్లినిచూచి “అమ్మగారూ! విడిపోయిన పూలరేకులు