పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీటలమీది పెండ్లి

5

కన్నుకొలుకున చెమర్ప కుమారుని ఎత్తి కవుంగలించుకొన్నారు! జయజయధ్వానాలు మిన్నుముట్టుతూ ఉన్నవి. ముత్తైదువులు, బ్రాహ్మణులు, హారతు లర్పించేవారు ఆశీర్వదించేవారై ఎదురుగా వచ్చారు? శ్రీ సోమనాథదేవ దివ్య శ్రీపాదములకు నివేదనలు అర్పించవలసినదిగా మహాప్రభువులు ఆజ్ఞ ఇచ్చారు. ఇంతలో దౌవారికుడువచ్చి ఒక కొమ్ములో ఉన్న రక్తం కుడిచేతిలోకి వంచుకొని మహారాజకుమారునిపై చల్లి నొసటను బొట్టు పెట్టెను. నగరంలోఉన్న దేవాలయాలన్నిట ఆనాడు అర్చనలు జరిగాయి.

కొన్ని ఘటికలు గడిచినతర్వాత మహారాజు మహారాజకుమారుణ్ణి చూడ్డానికి వెళ్ళినవాడాయెను. “ఆ కొండల్లోకి వాళ్ళగుఱ్ఱాలు లేళ్ళలా ఎక్కినాయి. ఇంతలో గన్నారెడ్డి నా కళ్ళకు గంతలు కట్టాలన్నాడు.”

“దొంగపోటు దుండగీడు. వాడితల కోటగోపురం ఎదుట వ్రేలాడాలి గాక!” అని లకుమారెడ్డి వళ్ళు పటపట కొరికినాడు.

“నాకళ్ళకు గంతలతోనే గుఱ్ఱాలపై రాళ్ళెక్కాము, లోయలు దిగాము, కొండలు దాటాము. దండంతాఆగింది. నాకళ్ళగంతలు విప్పారు. అద్భుతమైన తోటలు, మేడలు, ఒక చక్కని సెలయేరు, చుట్టూ ఎత్తైనకొండలున్నూ.”

4

ఈ గడబిడఅంతా కాండపటాలమధ్య పల్లకీలోఉన్న పెళ్ళికుమార్తె విన్నది. కాండపటాలను పట్టుకున్న పరిచారికలు, పల్లకీమోసే పరిచారికలు ‘ఆగండి!’ అన్న గంభీరస్వరం విని ఆగిపోయారు. మండలేశ్వరుల ఆజ్ఞ చొప్పున ఇరువురు కంచుకలు పరుగునవచ్చి “పెళ్ళికుమార్తెను లోనికితీసుకొనిపొం” డని, అది మహారాజుఆజ్ఞ” అని, దాసదాసీజనముతోనూ, సఖులతోను రాకుమార్తెను లోనికి బంపించివేసిరి. ఇంతలో అంతఃపురాల్లోకి గజదొంగ గోన గన్నారెడ్డి వచ్చి, అందరివీరులమధ్య ఉన్న పెళ్ళికుమారుణ్ణి ఎత్తుకొనిపోయాడన్న వార్త పిట్టపిడుగులా మారుమ్రోగింది.

పెండ్లికుమార్తెను మహారాణిగారి అభ్యంతరమందిరంలోకి తీసుకుపోయినారు. రాజమాతయున్నూ, మహారాణియున్నూ వధువుదగ్గరకు వచ్చి చేరినారు. పదునెనిమిదేండ్లు ఎలప్రాయముగల అన్నాంబికాదేవికి ఇదంతా ఒక హాస్య నాటకంలా తోచింది. మొదటినుండీ ఏకారణంచేతనోగాని, ఈ వివాహం అంటే ఆమెకు అంత ఉత్సాహం లేకపోయెను. చుట్టుప్రక్కల చుట్టాలవారి స్త్రీజనం అంతాను, పరిచారికాజనమున్నూ ఉక్కిరిబిక్కిరిగా మాట్లాడుకొంటున్న మాటల్లో కొన్ని ఆమె చెవిని బడుతున్నాయి.

“ఈ పాడురాక్షసుడు, పెండ్లికుమారుడి పెత్తండ్రి చుట్టమేనటమ్మా!”

“ఈతని పేరుచెబితే ప్రజలు, గ్రామాలు, రాజ్యాలుకూడా గజగజ వణికిపోతాయట.”