పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓరుంగల్లు

109

బాణాలు, గంధక బాణాలు పరపుతూ ఉన్నారు. గంధకం, సూరేకారం కలిపిన అగ్నిబాణాలు నగరకుడ్యాలపై పడి పెద్దమంటలతో మండుచుండెను. ఆ వెలుగులో వాడిగా బాణాలజడులు మహావేగంతో వెళ్ళి గోడలమీది వీరుల ప్రాణాలు కొంటున్నాయి. కందకాలలోనుండి అల్లరిచేస్తూ, ఈదులాడుతూ వీరులు శిలా పాతానికి అందక, అగ్నిపాతానికి అందక ప్రళయకాలంనాటి గడబిడ చేస్తుండిరి. దూరాననుండి మహాబాణయంత్రాలు వదలిన రజ్జునిశ్రేణులు వచ్చి లగ్గలకు తగిలి అక్కడ బిగిసి క్రిందికి వేలాడినాయి. ఒక వేయి నిశ్రేణు లట్లు తగలగానే, వీరులు చరచరా ఫలకాలు తలలకు బిగించుకొని చేతులతో కోతులులా కోటగోడ ఎగబ్రాక సాగారు. అగ్నిబాణాలు నిశ్రేణులను కోయడానికి వచ్చిన వీరులను హతమారుస్తున్నాయి. కొన్ని విశ్రేణులు కోయబడి వీరులతో పరిఘనీటిలో పడితే పుట్టెలతో సిద్ధంగా నీటిలో తేలియాడుతూ ఉన్నవాడూ, నీటిలో ఈదుతున్నవారూ ఆ వీరుల్ని రక్షిస్తూఉన్నారు.

“ఇంతలో నగరంలోనుండి ‘గన్నారెడ్డి! గన్నారెడ్డి! అని కేకలు వేస్తూ రెండువేలమంది కఱకువీరులు నగరకుడ్యాలపై రెండుమూడుచోట్లపడ్డారు. ఆ ప్రదేశాలలో లోకం పగిలినట్లు యుద్ధఘోష, సంకుల సమరమూ ఉద్భవిల్లినవి. ఆ బీభత్సములో కోటగోడలమీదకు వానరమూకలా గన్నారెడ్డి సైన్యం ఎగ బ్రాకింది.

‘గన్నారెడ్డి లోనికి వచ్చాడు’ అని గగ్గోలు పుట్టగానే కందూరు సైనికులకు ప్రాణాలమీద ఆశపోయి పారిపోయినారు. తమకు తెలియకుండానే వారి తలలు రాలిపోతున్నవి. ఈ గడబిడలో కోటనుండి యుద్ధం నడపడానికి వచ్చిన కేశి నాయకుడు ఒక కోటగుమ్మం తెరిపించి ఏనుగుల్ని, రథాల్ని, అశ్వికుల్ని కోట బయట ఉన్న గన్నయ్య సైన్యంమీదకు నడిపాడు. ఇంతలో విఠలధరణీశుడు అన్నగారి ఉపదేశాన్ని అనుసరించి ఆ బయలుపడిన సైన్యం ఎదుట పలాయన నాటక మాడి కేశినాయకసైన్యాలను దూరంగా తీసుకుపోయి, అక్కడ తనసర్వ సైన్యంతో ఆ సైన్యాన్ని చుట్టుముట్టి నాశనంచేయడం ప్రారంభించాడు.

“ఆసంగతి తెలిసికొన్న వెంటనే కేశినాయకుడు తన సైన్యం వదలి నగరం కోటలోనికి పారిపోబోయాడు. అత డలా వెళ్తూంటే -

‘కేశినాయకా! నిలు! నిలు!’ అంటూ గన్నారెడ్డి అక్కడకు చక్కా వచ్చాడు.”

8

“కేశినాయక ప్రభువు గన్నారెడ్డిమాట వినగానే నిలువునా నీరై పోయాడు. అతనికి ధైర్యం నీరై ప్రవహించింది. పదిక్షణాలు మాటరాక