మన విద్యాశాఖ
21 - 4 - 1928
1335 ఫసలి నివేదికయే మనకిప్పుడు లభ్యమైన నివేదిక. ఈ నివేదికలో మన విద్యాపరిస్థితులు కొంత చర్చింపబడినవి. దాని నుండి యనేకాంశములు మనము గమనింపవలసిన వున్నవి.
హిందూస్థానమందు ప్రతి రాష్ట్రములో విద్యా పరిస్థితులు దిన దినమభివృద్ధి చెందుచున్నవి. మన రాష్ట్రమందు కూడ నభివృద్ధియైనదనియు నివేదికా సంవత్సరములో 97 పాఠశాలలును, 14 వేల విద్యార్థుల సంఖ్యయు వృద్ధియయ్యెనని తెలుపుచు ప్లేగు కరువు వంటి కాలములో కూడ నింతవృద్ధియగుట చాల సంతోషమని నుండివినారు. కాని యధార్ద పరిస్థితులెట్టివో యించుక విమర్శింతము. మన సర్కారు వారు ఈ 1335 లో విద్యపై సుమారు 74 లక్షలు వ్యయపరచినారు అనగా మొత్తము ఆదాయములో సుమారు పదవ భాగము (నూటికి 10 వంతున) ఖర్చు అయ్యెను సాధారణముగా నిట్టి వ్యయము మరి యే రాష్ట్రమువారును జేయరని అందురు కాని యింత స్వదేశ సంస్థానములను బోల్చిచూచిన యీ యభిప్రాయమును సవరించుకొనవలసివచ్చును మైసూరు రాజ్యము వారు 61 లక్షల రూపాయలు (కల్దారు) కర్చు పెట్టుచున్నారు. అనగా ప్రతి మనుష్యునిపై వారు 1-0-8 ప్రకారము ఖర్చు చేయుచున్నారు మన రాష్ట్రములో 0-8-0 (ఎనిమిది అణాలు) మాత్రమే ప్రతి వానిపై వ్యయము చేయుదురు మరియు తిరువాన్కూరు సంస్థానములో 42 లక్షల రూపాయీలు విద్యకై వినియోగించి యున్నారు. అనగా సర్కారీ వసూలలో నూటికి 18 ప్రకారము వ్యయ పఱచినారు దీని వలన మన రాష్ట్రములో విద్యపై యింకను వ్యయ పఱచిన నష్టము లేదని విశదమగును. ఇంక విద్యావంతుల సంఖ్యలను గూర్చి కొంత చర్చింతము మన రాష్ట్రములో మొత్తముపై 4098 పాఠశాలలును 2 లక్షల 58 వేల విద్యార్థులును నున్నారని తెలుపబడినది. అనగా మొత్తముపై విద్యార్ధుల సంఖ్య 14 వేలు హెచ్చెనుగాని ఖాన్గీ పాఠశాలల వ్యవస్థ మాత్రము గమనింపదగి యున్నది. ఈ 1335 లోని తీరు నెలలోనే ఖాన్గీ పాఠశాలల చట్టము బయలు దేరెను. కావున దాని ఫలిత మేమన --