Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60

గోలకొండ పత్రిక సంపాదకీయాలు

హీనపు స్థితిగతులను చక్కబరచుటకు రైల్వే మంత్రిగారు ఎట్టి ఏర్పాటును జేయరైరి సానుభూతి మాత్రము కొరతలేకుండా ప్రకటించిరి కానీ దీని వలన గలుగు లాభమేమి ?

నిజాం రైల్వేలో గూడ పైన పేర్కొనిన ఇబ్బందులు గలవు. బెజవాడ నుండి ప్యాసింజరు బండిలో ప్రయాణము చేయువారికి, నోరు ఎండి ప్రాణము పోయినను, అనేక స్టేషనులలో గుక్కెడు మంచినీళ్ళు దొరకుట దుర్లభము. సికింద్రాబాదు స్టేషనులో ప్రయాణీకులు ఎండలో మలమల మాడవలసినది గాని ప్లాటుఫారము మీదగాని, వంతెన మీదగాని కప్పు లేదు. టిక్కెట్టు కలెక్టరుల జులుము అందరకు విదితమే అన్ని రైల్వేల కంటేను ఈ రైల్వే కంపెనీ వారికి లాభమెక్కువగా నున్నది కానీ రైల్వే చార్జీలలో చిల్లిగవ్వ యైనను తగ్గించుట లేదు. దీని గూర్చి ప్రభుత్వము వారు కొంతలో కొంత శ్రద్ధ పుచ్చుకొనిననే గాని పరిస్థితులు మారవు