Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సురవరం ప్రతాపరెడ్డి

59

కలిగించినగాని ఎట్టి ప్రయోజనము నుండదు. అదియునుం గాక పై మూడు రైల్వేల లోన 50 మైళ్ళకు మించిన ప్రయాణములకు మాత్రమే మైలుకు నాలుగు దమ్మిడీల చొప్పున తగ్గింతురు కాన ఇది బీదలకు, పేద రైతులకు ఉపశాంతి నొసగ జాలదు. మన రైతుల ప్రయాణములు సర్వ సామాన్యముగా 50 మైళ్ళ లోపునే యుండును అట్టి తరి ఈ క్రొత్త ఏర్పాటు వలన చాలినంత మేలు కలుగుట లేదు.

ప్రయాణికుల రెండవ కష్టము రైల్యేయుద్యోగుల వలన సంభవించుచున్నది. బుకింగు క్లర్కులు, టిక్కెటు కలెక్టరులు స్టేషను మాస్టరుల అక్రమ చర్యలు అందరికి దెలిసినవే. పెద్ద కుటుంబములు తీర్థయాత్రలకు వెడలుతరి, వారికి సౌకర్యముగా ఒక కంపార్టుమెంటునో, డబ్బానో ఏర్పాటుచేయుటకు ఎన్నియో పాట్లు పడుదురు. ట్రెయిను ప్లాటు ఫారము మీద వున్నప్పుడు, ఆతురత తోడ బరుగెత్తుకొని వచ్చి టిక్కెటు వేడు పల్లెటూరి రైతు చిక్కులను వారినే విచారించవలెను. దారిని బోపు ప్రయాణీకులను ఎక్కువ సామానున్నదని పీడించి, దక్షిణ సమర్పించనచో, వారి ప్రయాణమునకు ఆటంకము గలిగించుట కొన్ని సందర్భములలో కలుగుచున్నది దినుసులు ఎగుమతి చేయుటకును గాను గూడ్సు వాగినులను కోరు వర్తకులు, స్టేషను మాస్టరుల దాసాను దాసులు, ఇటువంటి ప్రవర్తనమును పరిశీలించి, నిందితులను శిక్షించుటకుగాను ఒక విచారణ సంఘమును ఏర్పరచవలెనని జోషిగారు కోరిరి. ఈ చర్యలను శ్రద్ధతో పరిశీలింతునని వాగ్దాన మొసగుచు, ఇట్టి సంఘమవసరమని రైల్వే శాఖాధికారి త్రోసివేసెను ఈ వాగ్దానము ఎంతవరకు నెరవేర్తురో చూడ వలసి యున్నది.

మూడవది ప్రయాణికుల సౌకర్యములకు సంబంధించినది మొదటి, రెండవ తగరతి ప్రయాణికుల నుండి వచ్చు డబ్బు కంటె మూడవ తరగతి వారి వలన వచ్చు డబ్బు పది రెట్లు అధికమయినను, రైల్వేవారు వీరి సౌకర్యమును బాటించుట లేదు. తగినన్ని డబ్బాలు వుంచకపోవుట చేత, సుఖముగా కూర్చుండుటకు కూడ తావు దొరకుట లేదు స్టేషనులో మంచినీటి వసతి గాని, మరుగుదొడ్డి సౌకర్యములు గాని సరియైనవి లేవు. తిను పదార్ధములు, వెయిటింగు రూములు, ఎంత అశుభ్రముగ నుండునో అందరికి అనుభవమే. ఇట్టి