Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూడవ తరగతి ప్రయాణికులు

3 - 3 - 1928

ఉన్నవారి కందరు బెట్టుదురు అయ్య పెట్టును, అమ్మ పెట్టును, బంధువులు పెట్టుదురు, మిత్రులు పెట్టుదురు, తుదకు ప్రభువువారు కూడా పరామర్శింతురు కాని లేనివారిని అడుగు దిక్కులేరు. వారు నోరు విడిచి వేడినను విను దాతలు లేరు. ప్రభుత్వము మూడవ తరగతి రైల్వే ప్రయాణీకుల పట్ల అవలంబించు కార్యఫణతి కూడ నిట్లేవున్నది.

మూడవ తరగతి ప్రయాణికుల ఇబ్బందులు మూడుగా విభజింపవచ్చును. అందు మొదటిది రైల్వే చార్జీలు. గత దశ సంవత్సరములలో రైల్వే చార్జీలు క్రమక్రమముగా హెచ్చిపోయెను. ఇది ప్రయాణీకులకు, ముఖ్యముగా మూడవ తరగతి ప్రయాణికుల కెంతయో కష్టము కలిగించెను ఫ్రాన్సు, జర్మనీ ఇంగ్లండు మున్నగు దేశములకంటె మన దేశమెంతయో పేదది. మన దేశమున సుమారు 10 కోట్ల మంది తిండిలేక మలమల మాడుచున్నారని మొన్న మొన్ననే శాసన సభలో లాలా లజపతిరాయి గారు ప్రకటించిరి అయినను యూరోపు దేశములన్నిటిలో కంటె మన దేశమున రైల్వేలో సౌకర్యములు తక్కువగనున్నను, చార్జీలు మాత్రము ఎక్కువగ నున్నవి ఇది మన దురదృష్టము. కానీ ప్రభుత్వము వారి కష్టమును తొలగించుటకు ప్రయత్నింప కుండుట శోచనీయము 1927-28 సంవత్సరమున రైల్వేవలన 12 కోట్ల 75 లక్షల రూపాయలు లాభము కలిగినది. ఇది పూర్వపు వత్సరము కంటె 3 కోట్ల 75 లక్షలు అధికము. అందుచే నార్తు వెస్టర్ను, ఈస్టు ఇండియను, గ్రేటు ఇండియను పెనిన్సులారు రైల్వేలలో చార్జీలు కొంతవరకు తగ్గింతురట తక్కిన రైల్వే కంపెనీలతో చార్జీలను తగ్గింప ఉత్తర ప్రత్యుత్తరములు మాత్రము జరిపెదరట. కానీ ఈ ఉత్తరములవలన నెట్టి లాభమును గలుగదు ప్రభుత్వమువారు పట్టుదలతో వీటి విషయమై శ్రద్ధ వహించి కంపెనీల వారికి ఒత్తిడి