52
గోలకొండ పత్రిక సంపాదకీయాలు
సదులను ప్రజలు ఎన్నుకొను పద్ధతి ప్రవేశపెట్టవలయుననుట ఇంతవరకు నీ సభలలో ప్రభుత్వ నియోజితులేయున్నారు ప్రారంభదశలో ఇది అవసరమయినను నేడు అట్టి యవసరము లేదనవచ్చును గత నలువది వత్సరముల నుండి యీ సభలలో అధికారేతర సభాసదులను కూడ ప్రభుత్వాధికారులు ఏర్పరచుచున్నారు. కాని యింత మాత్రము చాలదు. ఈ తాతల నాటి పద్ధతిని వదలి యిప్పుడు నాగరిక రాష్ట్రములలోనున్న పద్ధతిని ప్రవేశపెట్టవలయునని ప్రజల కోర్కె 2 పెద్ద బస్తీలలో మజ్లీ సె సఫాయీ (మునిసిపాలిటీ) లను స్థాపించవలయుననునది ఇప్పుడిట్టి మజ్లిసు హైద్రాబాదునందు మాత్రము కలదు. అదియు సంపూర్ణ దశలో లేదు అస్వతంత్ర స్థితిలోనున్నది దానిని గూర్చి చిత్తు శాసనము గడచిన 30 ఏండ్ల నుండి మన శాసన నిర్మాణ సభలోపడి యున్నది బ్రిటిషు ఇండియాలో 5 వేల జన సంఖ్య కంటే మించిన ప్రతి బస్తీ యందు ఇట్టి సంఘములున్నవి కనుక మనవారును అట్లు చేయించవలయునని ప్రార్థించుచున్నారు 3. శాసన నిర్మాణ సభా సంస్కరణము అనగా దీనిలో ఇప్పుడున్నట్టు గాక ప్రజాప్రతినిధులను ఏర్పరుపవలయుననియు, ప్రజాశయములు ఈ విషయమును ఇదివరకే మహా ఘనత వహించిన మన ప్రభుత్వము వారు ఏడేండ్ల నుండి ఆలోచించుచున్నారు. ఉత్తమ పరిపాలనమునకును నిదర్శనములగు నీ సంస్కారములను ప్రభుత్వమువారు త్వరలో ప్రసాదించగలరని మా యభిప్రాయము 4 విద్యా విషయములు ఖాన్గీ పాఠశాలల విషయమున చేయబడిన నిర్బంధ శాసనమును రద్దుచేయుట, ప్రారంభ విద్య, మాధ్యమిక విద్య విద్యార్ధి యొక్క మాతృభాషలోనే గరుపబడవలయుననుట, ప్రారంభ విద్య ప్రజా స్వాధీనముచేసి ప్రభుత్వమువారు సహాయము మాత్ర మొసగుట మంచిదనుట మున్నగునవి సూచింపబడినవి
ఇట్లు ప్రజలు ప్రభుత్వమువారి ముఖాముఖిగా అడుగ గలుగుట నూతనమైన ప్రజా ప్రబోధముగ భావించుచు దీనికి కారకులగు వారిని మేము మనఃపూర్వకముగ నభినందించుచున్నాము.