Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సురవరం ప్రతాపరెడ్డి

51

మన చేతులలో లేనందున, దయామయులగు ప్రభుత్వము వారి సానుభూత వాక్యములను వినజాలకుంటిమి ఇట్టి లోపమును ఒక విధముగ తొలగించుటకు వినతి పత్రములు అర్పించి ప్రత్యుత్తరము బడయు నీ నూతన పద్ధతి చాల మంచిదని మా తలంపు. ఈ పద్ధతినే, ప్రతి జిల్లా ప్రజలను ప్రతి తాలూకా ప్రజలను, ప్రధానమంత్రిగారు గాని శాఖ మంత్రులు గాని తమ ప్రాంతములకు దయచేసినప్పుడు అవలంబించు చుండినచో చాల ఉపయోగకారి కాగలదు.

మన ప్రధానమంత్రిగారి యెదుట చెప్పుకొనబడిన ప్రజావసరములను మూడు విధములుగ భాగింపవచ్చును 1. స్థానికావసరములు 2. ప్రత్యేక సంఘ అవసరములు 3. ప్రజావసరములు

మొదటి వానిలో రోడ్లు, నీటి వసతులు వెలుతురు మున్నగువాని యేర్పాటులు చేరియున్నవి ఇవి ఆ ఆ స్థలము వారికే సంబంధించి యుండును కనుక ఇవి అన్నిటికంటె ముఖ్యములు, సులభముగా తీర్పదిగినవియు. రెండవవానిలో, ప్రజలలోని ఒక ప్రత్యేక సంఘమునకు మాత్రము సంబంధించిన విషయములు గలపు గుల్బర్గాలోని హిందూ ప్రజలు హిందువులకు గల కష్ట నిష్ఠురములను, అవసరములను తెలుపుకొని యున్నారు. తాము ప్రజా సమూహములలో నూటికి 53 మంది చొప్పునగల గొప్ప సంఘమై యుండినను, తమకు గొప్ప యుద్యోగములు లభింపకుండుట, మునుపు దొరకుచుండినవియు తక్కువ యగుట, తమ మత విషయక కార్యములకు ఆటంకములు కలుగుచుండుట, తమ తమ సంబంధ సమస్యలను పరిష్కరించుటకు ప్రభుత్వము వారి మత శాఖ (ఉమూరే మజహబి) లో ఒక హిందూ అధికారి నియోగింప వలయుననుట ఇటీవల నాశనము చేయబడిన దేవాలయములను బాగుచేయ వలయుననుట మున్నగునవి మనవి చేసికొనియున్నారు. ఇట్లు తమ కోరికలను ప్రభుత్వము వారికి మనవి చేసికొనుటలో హిందువులు మంచి మార్గము నవలంబించిరి. అడిగిన గాని అమ్మ కూడపెట్టదు కదా! ప్రభుత్వమువారును వాని విషయమున ఎంత త్వరగా శ్రద్ధ వహించిన అంత మంచిదని మా యభిప్రాయము.

మూడవ వానిలో మన రాష్ట్రములోని అన్ని తెగలవారికిని, అధికారులందరికిని, సంబంధించిన విషయములు కలవు. 1. లోకల్ ఫండు సభలలోని సభా