Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మన రాష్ట్రాభివృద్ధి

8-10-1927

ఆర్థికశాఖా మంత్రులగు నవాబు హైదరునవాజుజంగ్ బహాదురు ప్రకటించిన 1337 ఫసలీ ఆదాయవ్యయ పట్టిక చాలా యుత్సాహకరముగ నున్నది ఈ సంవత్సరము క్షామ నివారణము, అభివృద్ధి శాఖ, మొదలగు నిధులకు నిలువ యందు మొత్తము పోగ 44 లక్షలు నిలువ యుండునని అంచనా వేయబడినది. మన రాష్ట్రము యొక్క ఆర్థిక పరిస్థితులు చక్కబరచి తగిన మొత్తము వ్యయ పరచుచు నిలువ చూపుచున్న మన ఆర్థిక శాఖ మంత్రులెంతయు ప్రశంసనీయులు

రిజర్వు నందు మొత్తము 15 కోట్లన్నర సంవత్సరాంతమున నుండునట్లు అంచనా వేయబడినది ఈ మొత్తము నుండి సగము 1934 సంవత్సరమున రైల్వే కొనుటకు వెచ్చింపబడును. అపుడు రైల్వే కంపెనీ మన ప్రభుత్వము వారి స్వాధీనమునందే యుండును. ఇంతియ కాక కాజీపేట బెల్హరుషా రైల్వే పని పూర్తిజేయుటకును కొన్ని ఇతర ఇనుపదారులను వేయుటకును తగిన మొత్తము నిర్ణయింపబడినది పై రైల్వే నిర్మాణమునకును, ఇర్రిగేషనునకును, 136 లక్షలు నిర్ణయింపబడినవి ఇపుడు నిర్మాణము నందున్న ప్రాజెక్టులన్నియు పూర్తినొనరింపబడును

బడ్జెటు నందు ఆయా శాఖల కొరకు కొంత మొత్తము ప్రత్యేకింపబడును కాని శాఖాధికారులు వానిని ఉపయోగించక నిలువ యుంచెదరు దీనివలన ఆయా శాఖల యందు జరగవలసిన అభివృద్ధికి ఆటంకములు కలుగుచున్నవి ప్రభుత్వము వారిచే వ్యయపరచుటకై నిర్ణయింపబడిన మొత్తము యేల యుపయోగింపబడదో దురూహ్యము. ఈ సంవత్సరము యూరోపియను అధికారులు నియమింపబడుటచే వ్యయమునందు రెండు లక్షల హెచ్చినట్లు మంత్రిగారు సూచించుచున్నారు రాష్ట్రము నందుగల ఇట్టి ప్రోత్సాహకరమగు