Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నన్నయ భట్టారక వర్ధంతి

21-9-1927

శ్రీకృష్ణదేవరాయల ఆంధ్రభాషా నిలయమువారు గత శనివారము నాడు నన్నయ భట్టారక వర్ధంతి జరిపి యుండిరి. ఆ సభా వృత్తాంతమును స్థలాంతరమున ముద్రించి యున్నారము ఇట్లు కవుల వర్థంతులను జరపునట్టిది ఈ నిలయమొక్కటియే సకలాంధ్ర భూభాగమున గనపడుచున్నది. భాషాభివృద్ధికై ఏర్పడిన గ్రంధాలయములిట్టి మంచి పద్దతి నేల యనుకరింపగూడదో మాకు దోచకున్నది. హైదరాబాదులోని గ్రంథాలయములవారైనను తాము ప్రత్యేక సభలను సమావేశపరచుటకు అనుకూలము లేనిచో, నిలయమువారిలో జేరి సభ కెక్కుడు ప్రాతినిధ్యమిచ్చి, మిగుల యాకర్షణీయముగ నొనర్పకుండుటకు గారణము దురూహ్యము. నిర్వివాదమయిన ఇట్టి భాషావిషయ కోపన్యాసము లందు మనము ఏకముఖముగా ప్రవర్తించిననేగాని, జనులయందు భాషాభిమాన బీజములు నాటుటకు అవకాశము కలుగజాలదు. ఆయా గ్రంధాలయాధికారులు ఈ విషయమును గూర్చి యాలోచించెదరుగాక !

ఇక సభావృత్తాంతమును గమనించినచో అది మిగుల నిరుత్సాహకరముగ నున్నదని తెలుపుటకు చింతించుచున్నాము ఒక బాలేందు శేఖరముగారు చెప్పిన నాలుగు మాటలుతప్ప శ్రీ సోమయాజులుగారేమి, అధ్యక్షులగు ప్రభాకరరావుగారేమి, నన్నయభట్టు భారత రచనా విశేషములనుగూర్చి సుంతైనను ముచ్చటించ లేదు భారతము నెవ్వరు వరించుటలేదేయని వాపోయినంత మాత్రమున లాభము లేదు. నన్నయభట్టు రచనయందలి మేలిగొనముల నెత్తి చూపి, శ్రోతలను ఆకర్షించి వారికా గ్రంధము జదువు సబిలాష పుట్టినట్లుగా ఉద్బోధించవలయును అధ్యక్షులవా రయినను “ఎవ్వతె వీవు... అటజనించె..." అను మనుచరిత్ర పద్యముల నుద్ఘాటించిరేగాని నన్నయ పద్యరత్నములను ఉదాహరించి యుండలేదు ఆయా సమావేశ విషయములను బురస్కరించుకొని, ఆయా కవుల