ఐకమత్య సందేశము
3-9-1927
భారతదేశము నందు సంఘ ద్వేషము దిన దినము ప్రబలుచున్నది. ఎటుచూచినను హిందూ మహమ్మదీయ తగవులు గాన్పించుచున్నవి. స్వల్ప కలహములే మత యుద్ధములుగా మారుచున్నవి. ఇంతవరకు ఎన్ని సభలు జరిగినను, ఎన్ని సంధి పత్రములు వ్రాసికొనినను ఫలితము అన్యధా పరిణమించినది. భారతదేశమిట్లు అధోగతి పాలగుచుండ ఏ శాంతిప్రియుడు విలపింపకుండును? దేశమునందు అల్లరులు జరుగుచుండిన యే సంఘము వారికై నను లాభము కల్గునా?
ఈ విషమ పరిస్థితులు వీక్షించుటచే రాజ ప్రతినిధులగు ఇర్విను ప్రభువుగారి హృదయము కరిగినది. వారు అన్ని పక్షముల వారి యందు ఐకమత్య మవసరమని తలంచిరి. వీరి ప్రసంగము ఫలితముగ సిమ్లా చల్లని ప్రదేశమున సర్వ రాజకీయ పక్ష నాయకులు సమావేశమై ఈ విషయమై ఆలోచించి దేశీయులకు విన్నపము ప్రకటించిరి. అందరు ఐకమత్యముతో నుండవలయునని ప్రబోధించిరి; లేనిచో జాతీయ వికాసము కలుగనేరదని విలపించిరి. నాయకులందరును తమ భేదములు విడనాడుకొనుటకు సమ్మతించిరి. అయినను ఇట్టి విన్నపముల వలన పరిస్థితులు చక్కబడునా? "ఐకమత్యము, ఐకమత్యము" అని ఒక వంక చల్లని ప్రదేశము నందుండి నాయకులు యుద్ఘోషించుచుండ వేరొక వంక కాన్పూరు నందు పరస్పర కలహము జరుగుచునే యున్నది కదా?
దేశము నందు శాంతి సమకూరుటకు దేశీయుల భావములు మార్పు గాంచవలయును. నాయకులు ప్రజలకు ఆదర్శప్రాయులు గనుక వారు మున్ముందు తమలోగల భేదాభిప్రాయములు విడనాడుకొని ఏక కంఠముతో జన సామాన్యమునందు ప్రచారము గావించవలయును. అందరు నొకే మార్గమునకు దారి చూప