ఈ పుట ఆమోదించబడ్డది
సురవరం ప్రతాపరెడ్డి
31
లుగ విభజింపబడి యుండును. 1. రాజ్యములోని గొప్పవారు 2, చారిత్రక మందిరములు, ప్రదేశములు 3. పారిశ్రామికములు. 4. ఇతరములు. డబల్ డెమ్మీ సైజున ("8" + 11 ") సంపుటము ప్రకటితమగునని నివేదికయందు కలదు. ఉద్యోగ ప్రియులగు పై ముద్రాలయము వారు, దేశీయులను రాజ పోషకులుగను (రూ. 500/-లు), పోషకులుగను (రూ.250/-), ఆభిమానులుగను (రూ. 100/-) వుండుటకు అంగీకరించి ఈ యుద్యమమున తోడ్పడ వేడుచున్నారు. ఆంధ్ర యౌవనుని ఈ యుత్సాహము ప్రశంసార్హము. దేశీయుల సహాయమునకు వీరు పాత్రులై యున్నారని సూచించుచు మా మిత్రులగు శ్రీకృష్ణస్వామి గారినీ మహోద్దేశమునకుగాను అభినందించుచున్నాము.