Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సురవరం ప్రతాపరెడ్డి

27

మన నాయకుల స్థితి యీ రీతి యుండ ప్రజలు మాత్రము వారి అభిప్రాయానుసారము మెలగక పూర్వము అసహాయోద్యమమునందే నిలచియున్నారు. ప్రభుత్వము వారు వంగరాష్ట్ర రాజకీయ నిర్బంధితుల విడుదల గావింపలేదని నాగ్పూరునందు అవరేగారి నాయకత్వమున ఆయుధ శాసన ఉల్లంఘనము జరుగుచున్నది. ప్రతినిత్యము స్త్రీలు పురుషులు ఆయుధపాణులై సివిలు లై నునందును ఊరేగుచున్నారు. పోలీసువారు మొదటి దినములలో కొందరిని అరెస్టు చేసిరి. కాని యిపుడు మౌనము వహించియున్నారు.

ఇదియే రీతి బొంబాయి రాష్ట్రమందలి ఆలీబాగు నందు పన్నులు ప్రభుత్వమున కొసగగూడదని తీర్మానించుకొని సత్యాగ్రహమునకు పూనుకొనిరి. గత సంవ్సతర మిచట రిసెటెలుమెంటు జరిగియుండెను. ఇందువలన పన్నులు హెచ్చింపబడెను. ఎన్నిసార్లు రైతులు మొరపెట్టుకొనినను అధికారులు గమనించలేదు. అందుచే వీరు సత్యాగ్రహమునకు పూనుకొనిరి. నాయకులెవ్వరో తెలియుట లేదు. కాంగ్రెసు అధ్యక్షులు అలీబాగునకు వెళ్ళి అచట స్థిరచిత్తులయి యుండవలయునని ప్రజలకు హితవు గరపిరి.

ఇంతియేగాక దేశమునందు మతావేశపూరితలగు నాయకులు కొందరు గలరు. వీరి ఉద్రేకపూరితమగు యుపన్యాసముల వలస అపుడపుడు హిందూ మహమ్మదీయ కలహములకు కారణమగుచున్నది. ప్రభుత్వము వారింతవరకే "విభజింపుడు, పాలింపుడు" - అను సూత్రమును అనుసరించి ఉద్యోగముల యందును, వోట్లయందును, మత భేదములు గల్పించి యున్నారు, వానికితోడు మత ప్రచారము తీవ్రరూపము దాల్చుటకు సహాయపడుచున్నది. ఇట్టివారి నాయకత్వము పోయిననేగాని దేశ విముక్తి సాధ్యపడ నేరదు. కనుక ప్రజలు వీరి అభిప్రాయములకు చెవి యొగ్గకూడదు.

దేశమునందు పరిస్థితులు ఇట్లుండ మేనెల 15 వ తేదీ బొంబాయి నగరమున కాంగ్రెసు కార్యనిర్వాహక సభ గూడుచున్నది. సభవారు పరిస్థితులు సమగ్రముగ చర్చించి యేమి తీర్మానింతురో అని అందరు కుతూహలపడు చున్నారు. కనుక ఇట్టి సందిగ్ధ స్థితియందు సభవారు పెడమార్గమునకు ద్రొక్కక దేశముయొక్క దాస్య విముక్తికై చక్కని మార్గము నిరూపించెదరు గాక.