Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సురవరం ప్రతాపరెడ్డి

25

వార్తలు ప్రకటించునపుడు, మన ప్రభుత్వము వారు "ఈ వార్తలు అసత్యములనియు, రాజ్యాంగమునందు సంస్కారములు చేయవలయునని ప్రభుత్వమువారు తలంచుచున్నారనియు త్వరలోనే ఆ సంస్కారములు ఆరంభింపబడుననియు, ప్రజలకు తెలియుటకై ప్రకటనము గావించిరి. ఈ ప్రకటనము తరువాత కొన్ని మార్పులు జరిగినవి. 1. మహరాజా బహాదురు గారు ప్రభుత్వ సభాధ్యక్షులుగ నియోజితులైరి. 2. మాల్గు జారీ పోలీసు ఈ రెండు శాఖలను చేర్చి వీనికి మంత్రిగా కర్నలు ట్రేంచు గారును, 3. మాల్గు జారీ కార్యదర్శిగా మిస్టర్ టాస్కరు గారును, 4. సదరు నాజము కోత్వాలి అజ్లా పదవి పైన మిష్టర్' ఆర్మ్ స్ట్రాంగు గారును, 5. పారిశ్రామిక శాఖ యొక్క కార్యదర్శిగా మిష్టర్ కాలిన్సు గారును, 6. నాజము అత్యాత్ పదవికి నవ్వాబ్ తకీయార్ జంగుగారును నియోజింపబడిరి. ఇవి యన్నియు ఉద్యోగస్తులలో మార్పులే కాని రాజ్యాంగ వ్యవస్థలో మార్పులనుటకును వీలు లేదు. ప్రభుత్వ విధానములో 1329 ఫసలీలో నేర్పబడిన ప్రభుత్వ సభా (బాచె హుకూమతు) పద్ధతి తప్ప తరువాతి మార్పు ఇంకను ఏదియు జరుగలేదు. ఇది 1329 నుండి 1336 వరకు గడచిన (7) వత్సరముల ఉదంతము.

కనుక మహా ఘనత వహించిన మన ప్రభువు గారి సంకల్పమును, ప్రభుత్వ సభాధ్యక్షుల వాగ్దానములును, ప్రభుత్వము వారి ప్రకటనములును, రాజ్యాంగ సంస్కారముల విషయమున ఇంకను ఆలోచనములోనే యున్నవనియును ఈశ్వరానుగ్రహమున్నచో కార్య రూపమున వెలువడగలవనియు నమ్ముచున్నాము.