Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీప్రభువుగారి జన్మదినోత్సవము

5-1-1927

మహా ఘనత వహించిన నిజాము ప్రభువుగారి జన్మోత్సవము రేపటిదినము రాజధాని యందును, ఇతర స్థలములందును రాజభక్తితో జరుపబడ నున్నది. నేటి నుండి మన ప్రభువుగారికి 43 వ సంవత్సరము ఆరంభమగు చున్నది. ఈ సుసందర్భమున, శ్రీ ప్రభువుగారిని, ఒక కోటి ఇరువది నాల్గు లక్షల ప్రజల పక్షమున మేము సవినయముగా నభినందించు గౌరవమును బడయుచున్నారము.

మన ప్రభువుగారు రాజ్య సింహాసన మధిష్ఠించిన నాటగోలె రాష్ట్రములో పెక్కు మార్పులు జరిగినవి. శ్రీ ప్రభువుగా రపార ప్రజ్ఞాబలయుతులు. వీరి కాలముననే యనేక ప్రసిద్ధ నిర్మాణములు జరిగెను. ఇంకను క్రొత్త క్రొత్త కట్టడములు జరుగుచున్నవి. రాజ్యాంగము నందలి విమర్శ నీయాంశముల శ్రీ నిజాము ప్రభువుగారు శ్రమయనక శ్రద్ధతో పరికించి స్వయముగా తగు నేర్పాటులు చేయుచుందురు.

మన ప్రభువుగారు రాజ్య భారమును వహించి (17) వత్సరములు కావచ్చినది. వీరి పాలనమున రాజ్యాంగమునందెన్నియో మార్పులు జరిగినవి. ముఖ్యముగ వీరి కాలముననైన విద్యాభివృద్ధియు కృతజ్ఞతా పూర్వకముగ గొనియాడదగియున్నది. ప్రారంభ విద్యయందు వ్యక్తమైన యభివృద్ధియే కాక, ఉన్నత విద్యలను రాజ భాషయగు ఉర్దూలో నేర్పుటకై శ్రీ ప్రభువుగారి వలన ఆదర్శపూర్వకముగ స్థాపింపబడిన ఉస్మానియా విశ్వవిద్యాలయము మూలమున ఎంతయో యుపయోగము కలుగుచున్నది. నాల్గు వత్సరముల నుండి విశ్వవిద్యాలయమువలన స్నాతకులుగా జేయబడిన వారి సంఖ్య నాల్గు వందలకు మించినదని చెప్పవచ్చును. ఈ విశ్వవిద్యాలయము యొక్క 8 వత్సరముల యభివృద్ధి, మద్రాసు విశ్వవిద్యాలయమునకు సంబంధించిన నిజాము కాలేజి