Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సురవరం ప్రతాపరెడ్డి

17

చేతను, దినదినము క్షీణించుచున్నారని ఆచార్య రాయిగారు తమ యభిప్రాయముగా కమిటివారితో తెలిపెను. మరియు "పై రాయిగారు మొన్న మద్రాసులో నుపన్యసించుచు నొక్క ఇంగ్లీషుదొర భోజనము చేయు విలువగల పదార్థమును మన యంబలి త్రాగు రైతులు 40 మంది తినుచున్నారని యుదాహరించిరి. మరియు కొందరు తమ సాక్ష్యములో రైతులు దినదినము బాకీల పాలై క్షీణదశనొందుచున్నా రని నివేదించిరి. భూమి గుణము క్షీణించినది. మరల వీనిని సారవంతముగా నొనర్చుకొనుటకు రైతునకుశ క్తి చాలదు.ఎల్లప్పటికి నతడు సంవత్సరమంతయు నెండలో మాడి వానలో తడసి కష్టించి సంపాదించిన యా కొద్ది మొత్తమును సాహుకారి తన వడ్డీ క్రిందికే లాగుకొనుచుండగా రైతు భూములను వృద్ధిచేసి కొనకుండిన మానె, తాను జీవించుటెటులు?

కావున వ్యవసాయపు కమిటీవారు రైతులను ఋణముల పాలుకా కుండునట్లు చేయుటయెట్లు. వారిని విద్యావంతులను చేయుట యెట్లు, వారికి వ్యవసాయ శాఖలవలన నెట్లు లాభము గలిగింప జేయవలయు నను విషయములను చర్చించి దానికి తగిన సూచనం గావించిన దేశమునకు మహోపకారము చేసిన వారగుదురు.