Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యవసాయ సమస్యలు

15-12-1926

వంగ రాష్ట్రములో నొక కలెక్టరుగానున్న ఖాన్ బహద్దరు మోమెన్ అనువారు వ్యవసాయపు కమిటీవారి యెదుట వ్యవసాయ విషయమై యిట్లుచెప్పిరి. "వ్యవసాయ శాఖలో వ్యయము చాల యగుచున్నది. గొప్ప వేతనములు కల యుద్యోగులే పెక్కురున్నారు. అటుకాక జిల్లా యుద్యోగులును ప్రదర్శకులును (Demonstrators) విశేషముగా నుండవలయును. సర్కారీ వ్యవసాయశాఖ జనులలో నాదరణము నొందినది కాదు. అనేక రైతులు సర్కారు ద్రవ్యము వ్యర్థముగా వ్యయమైనదని నమ్ముచున్నారు. అధికారులూరకే తిరుగుటే (సఫర్ చేయుట) కాని యే యుపయోగ కార్యముల చేయలేదని తలచుచున్నారు. పెద్ద యధికారులు రైతులను కలియుట లేదు?

ఇంతవరకును విద్యావంతులైన వారును, పరదేశీయులును, హిందూస్థానపు రైతునకు క్రొత్త సంగతులు తలకెక్కవనియు, చెప్పిన గ్రహింపరనియు నొక యపవాదము కల్పించియుండిరి. కాని వారింతచేసిన ప్రయత్నములేమి? పైవారి వాఙ్మూలము వలన వ్యవసాయశాఖ రైతునకర్థము కానిదిగా నున్నదనియు, వ్యవసాయాధికారులెట్టివారో రైతెన్నడును చూడలేదనియు విశదమయ్యే కదా! ఇక ముందై నను ప్రభుత్వమువారేకాక విద్యాధికుడైన ప్రతివాడును బీదరైతుపై కొంచెము శ్రద్ధ బూనవలయును. సర్కారువారి కందరికన్న నెక్కువ యాదాయము కలిగించు వారీ రైతులే. కొంచ మించుమించుగా సర్కారుకు లాభము కలిగించు విషయములో వీరికి తులదూగువారు త్రాగుబోతులు.

ఇతర శాఖలపై, ఇతర విద్యలపై ఖర్చు పెట్టిన దానికన్న రైతులకు కావలసిన వ్యవసాయ విద్యపైనను, వ్యవసాయ శాఖపై నెంత వ్యయము చేసినను లోపములేదు. రైతులు విద్యాలోపముచేతను, తిన తిండిలేక దారిద్ర్యము