సురవరం ప్రతాపరెడ్డి
15
నటులను, ఈ సంఘమువా రేర్పాటు చేసినయెంతయు మేలు కలుగును. వ్యవసాయ శాఖకును, రయితులకును దగ్గఱ సంబంధమున్నగాని వ్యవసాయ మభివృద్ది చెందును.
ఈ సంఘము వారింకొక విషయమును తమ దృష్టి యందుంచు కొనపలెను. ప్రస్తుతము వ్యవసాయములో గమనింపబడుచున్న మన దేశీయ వాడకులను వారు గ్రహింపవలసియున్నది. మన దేశములో వ్యవసాయము నిన్న మొన్న నేర్చుకొనిన పరిశ్రమకాదు. అనేక వేల సంవత్సరముల నుండి నానాటికి వికాసము గాంచుచు వచ్చిన కళ. కాని మన పద్ధతులలో ననేక మహత్తరమైన వైజ్ఞానిక విషయములు నిగూఢమై యున్నవి. ఈ యంశమును ప్రస్తుత మనేక పాశ్చాత్య వ్యవసాయ శాస్త్రజ్ఞులు కూడ నంగీకరించి యున్నారు. కాన విచారణ సంఘము వారు మన పద్ధతులను తేలికగా నొక మూల ద్రోసివేయక, వానిని బూర్తిగ లెక్కగొని తగు మార్పుల సూచించవలెను. అట్లయినగాని వీరి సూచనలకు తగు విలువగాని ఫలముగాని యుండదు. ఈ విషయమున వివిధ రాష్ట్రీయ వ్యవసాయశాఖ మంత్రు లీ సంఘము వారికి దోడ్పడ గలరని నమ్ముచున్నాము.