Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

గోలకొండ పత్రిక సంపాదకీయాలు

యము లన్నియు నిదివఱకే మన మెరుగుదుము. వీనిని మఱల వల్లించుటకు వేలకొలది రూపాయలు ఖర్చుపెట్టి ప్రత్యేకముగా నొక సంఘమును నియోగింప నవసరములేదు. ఋణము చేయుట మోసమని యెల్లఱకును విశదమే. కాని విధిలేక రయితులప్పుల పాల్పడినారు, పడుచున్నారు. ఋణస్తులను ఋణ విముక్తుల జేయుటెట్లు? ఋణము చేయబోపు వారిని దాని నుండి మరల్చుటెట్లు: ఈ యంశముల గూర్చి యీ విచారణ సంఘము వారు మార్గముల జూపిన దేశీయులు కృతజ్ఞులయ్యెదరు.

ప్రస్తుతము వ్యవసాయశాఖవారు చేయుచున్న ప్రయత్నములలోను, అవలబించు పద్ధతులలోను, గొన్ని నిష్ఫలములును, నిష్ప్రయోజనములునునై యున్నవి. వీరు సలుపుచున్న శోధనలు విద్యకును, విజ్ఞానమునకును సంబంధించిన వగుచున్నవిగాని, ప్రకృతపు కర్షకుల వ్యవసాయ చిక్కులను పరిష్కరించుటలేదు. ఆమెరికాలో కృషికులు స్వయముగ వచ్చి, పంటలు పండించునపుడు తమకు గలుగుచున్న చిక్కుల నెల్లను వ్యవసాయ శోధకుల కెఱింగించెదరు. అటుపైని, యా సమస్యల గూర్చి పరిశోధన సంఘము వారు శోధన జేయుదురు. కాని మన దేశమున రైతునకును శోధన సంఘమునకును ఇట్టి సన్నిహిత సంబంధము లేదు. పరిశోధకులు తమకు దోచిన నేదియో నొక విషయము గూర్చి శోధన ప్రారంభింతురు. సంవత్సరములకొలది ప్రయత్నించి యేదియో నొక దానిని కనిపెట్టుదురు. కాని యది కేవలము వైజ్ఞానికముగ నుపయోగపడుచున్నది గాని, ప్రకృతపు సేద్యమునకు కక్కఱకు వచ్చుటలేదు. నారవిషయములలో నిపుణుడగు ఫిన్లో దొరగారెన్నియో సంవత్సరములు ప్రయాసపడి జనపనారను వేరు విధమున దీయుట కొక యంత్రమును కనిపెట్టిరి. కాని ఈ యంత్రము గూర్చి యే సేద్యగాడును శ్రద్ధ గొనలేదు. జనపనారదీయుట కిదివఱకొక సుగమమగు మార్గముండనే యున్నది. అందుచే యీ యంత్రము వారి కావశ్యము కాదు. వారి ముఖ్యావశ్యములు వేరు. వాని గూర్చి నూతనాంశముల వారికి దెలిపిన వారు శ్రద్ధ వహింతురు. కాని వానికి బదులీ క్రొత్త యంత్రము వారి కొసగిన వారు దానిని నిరసించుటలో నెట్టి వింతయు లేదు కదా! ఇట్టి దిక మీదట జరుగకుండునటులను. ప్రకృతపు సేద్యములోని సమస్యలను స్వంతముగగాని, వ్యవసాయకుల నడిగిగాని, దెలిసికొని మఱి శోధనకు గడంగు