సురవరం ప్రతాపరెడ్డి
5
ఆ భాషయందు సంపాదింపగలిగిరి. ఈ కాలముననే వీరు రచించిన ప్రథమ ఆంధ్ర గంథము “శివాజీ చరిత్రము" వెలువడెను.
తరువాత శ్రీ లక్ష్మణరావు గారి కార్యరంగము ఆంధ్రదేశమునకు మారెను. విఖ్యాతాంధ్ర భాషా పోషకులగు శ్రీ మునగాల సంస్థానాధీశుల దివానుగారు నియోజితులైరి. ఈ యుద్యోగము తరువాతి వాఙ్మయ సేవకు మంచి పునాది ఏర్పరచెను. తుదివరకు వారీ యుద్యోగముననే యుండిరి. దివాను కర్తవ్యములను వారు శ్రద్ధగా నిర్వహించ లేదనినచో అది యపరాధమగును; కాని మాకు వారితో గల పరిచయమును, వారి అనుదిన జీవితమును గూర్చిన యనుభవమును బట్టి చెప్పవలసినచో ప్రభువుగారు వీరితో మంత్రిత్వ కార్యముల నేసమయమున నిర్వర్తింపించు కొనుచుండిరో తెలియదు గాని, వీరు ఎప్పుడు వాఙ్మయ విషయక కార్యములందు నిమగ్నులైయుండిరని చెప్పగలము. 1909 వత్సరమున విజ్ఞాన చంద్రికా గ్రంథమాల నారంభించి వివిధ శాస్త్రీయ చారిత్రిక వాఙ్మయామాృత ధారలచే ఆంధ్రదేశీయులు హృదయ క్షేత్రములను ఫలవంతములుగ నొనర్చిరి. 1911 ప్రాంతమున వాఙ్మయ సేవా విషయికమగు ప్రచండమైన తుది ప్రయత్నము, అనగా "విజ్ఞాన సర్వస్వ" నిర్వహణము నారంభించి నిధనము నాటివారకు ఆ కార్యమును నిర్వహించి, "ఆ" భాగమును సుమారు 2000 పుటలలో మూడు సంపుటములుగా పూర్తి చేసి దేశీయుల కర్పించిరి. నాల్గవదగు “ఆంధ్ర సంపుటము" నకు పరికరముల కూర్చుచు, పరిశోధనము సల్పుచు," చాళుక్యులు దాక్షిణాత్యులే" యను వ్యాసమును వ్రాసి ముగించుచు ఆనాడే రాత్రి వేళ చెన్నపట్టణమున మరణించిరి.
ఈ మహాశయుని మహా సులభమును రసవంతమును నగు శైలియు ఎంతటి గహన విషయమునైనను కడు సుబోధముగా తెలియజేయు సామర్థ్యమును, దేశాభిమానాగ్నిని ప్రజ్వలింపజేయు మేధా విద్యుత్తును తలంచిన ఆశ్చర్యము కలుగకమానదు. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వములోని వ్యాసములననేకులు కలిసి వ్రాసిరని చెప్పవచ్చును. కాని ముఖ్యములగు, వ్యాసములన్నియు వీరివే. "విజ్ఞాన చంద్రిక" లోని "హిందూ మహాయుగము" 'మహమ్మదీయ మహాయుగము' అను గ్రంథములను కళాశాల తరగతుల కుపన్యసించు ఆంగ్లభాషా పండితులు ఎంతయో యుపయోగించు కొందురని చెప్పిన వాని యోగ్యత