ఈ పుట ఆమోదించబడ్డది
228
గోలకొండ పత్రిక సంపాదకీయాలు
స్థానిక శాసన సభలో ప్రవేశ పెట్టబడెను కాని హిందువుల దురదృష్టవశమున అది గూటిలో పారవేయబడెను వితంతూద్వాహ శాసనము ప్రవేశ పెట్టబడెను కాని సనాతనుల చమత్కారములకు వశమై అది కుంటుబడి యున్నది. ఇవి రెండే యీ శతాబ్దములో నిజాం రాష్ట్రములో కావింపబడవలె నని కోరబడిన హిందూ శాసనములు, వీటి గతి యిట్లయ్యెను మనకు లేకున్నను ప్రక్కయింటి వారి వైభవము నయిన చూచి యానందించి యూరడిల్లుడని సోదర సంస్కారులకు ఓదార్పు నిచ్చుచున్నాము