సురవరం ప్రతాపరెడ్డి
227
హద్దులుండవు బ్రాహ్మణ స్త్రీయు శూద్రుడు పరస్పరము ప్రేమించవచ్చును. హిందూ ముసల్మాను స్త్రీ పురుషులే ప్రేమించి వివాహమాడుచున్నారు. వైశ్యులును, శూద్రులును యిట్లే చేయవచ్చును అట్టిచో వివిధ శాఖలవారి వివాహములను రద్దుచేయుటకు సంఘము హక్కు సంపాదించుకొని దౌర్జన్యము చేయుట చాల మొరటు పని
అదేమి చిత్రమో ప్రపంచములో జనులకు తమ యింటి సంగతి చూచుకోనుటలో తృప్తి నొందక యితరుల వ్యవహారములలో వ్రేలుపెట్టు నాచారము ఎక్కువైపోయినది అన్నిటికన్న హెచ్చుగా వివాహ విషయములలో సంఘ మెక్కువగా జోక్యము కల్గించుకొనుచున్నది
జాన్ సెల్డన్ అను ఆంగ్ల పండితుడొక సందర్భములో నిట్లు సెలవిచ్చెను.
“Of all actions of a man's life his marriage does least concern other people, yet of all actions of our life it is the most meddled with by other people".
"ఒక మనుష్యుని చర్యలలో వారి వివాహ కార్యము మాత్రము ఇతరులకు బొత్తిగా సంబంధము లేనట్టిది కానీ మన జీవితములలోని అన్ని కార్యములలో నిదియే ఇతరులచే అత్యంతముగా లొడబెట్టబడినది".
ఈ పండితుని వాక్యములు అక్షరశః సత్యము హిందువులలో నాడును నేడును అంతశ్శాఖా వివాహములు జరుగుచున్నవి అవి యశాస్త్రీయమని నిర్ణయించి వారసత్వమందిబ్బందులు కల్పింతురు ఇప్పుడు తిరువాన్కూరు శాసనము వలన అట్టి యిబ్బందులు తొలగింపబడుచున్నవి
తిరువాన్కూరు సంస్థానము హిందూ ధర్మశాస్త్రమందు కాలనుగుణ్యముగా మార్పులు గావించుట మంచి శుభసూచకమైన విషయము. మన రాష్ట్రములో బాల్య వివాహ నిరోధక శాసనము కీ॥ శే॥ పండిత కేశవరావుగారిచే