222
గోలకొండ పత్రిక సంపాదకీయాలు
"విద్యాశాఖ యొక్క వైశాల్యమును బట్టి ఏకదమ్మున మార్పులు చేయవలెనని ఆశ పెట్టుకొనుట తప్పు క్రమక్రమముగా ప్రతి విషయముపై దృష్టిని సారించి సంస్కరించవలసి యుండును... ...... దేశ భాషలను గురించి నాకు పూర్తిగా శ్రద్ధ కలదు క్రమశః దానిని గురించిన సంస్కారములు చేయబడును....
ఉన్నతాధికారులలో మన నవాబు మెహదేయార్‌జంగు గారును చాల ఉత్తములు రాష్ట్రమునకుగాని రాజుకుగాని కించిత్తు కూడ వ్యతిరేకముగా తలపుచేయువారు కారు వారు రాష్ట్రములో నెప్పటికిని శాంతి యుండవలెననియు ప్రజలకు ఏలాటి యిబ్బందులు వుండకూడదనియు, అశాంతి నిర్మూలము కావలెననియు సదా హిత చింత చేయువారు
పై యిరువురి అభిప్రాయములను వినిన తర్వాత దేశభాషలకు సరియైన స్థానము వెంటనే కాకున్న క్రమశః యైన దొరకునని ఆశ పొడముచున్నది
అన్నియు సరేకాని క్రమశః అనుపదమే కొంచెము తట్టుకొనుచున్నది దీని యర్ధము రబ్బరు వంటిది ఎంత దూరము లాగిన అంత దూరము సాగును. అట్టి రబ్బరుకు కూడ తెగిపోవు సమయము రానేవచ్చును కావున క్రమశః అనగా యెంతకాలము? విద్యా విషయములో క్రమశః వుండవచ్చునా? నూటికి 85 పాళ్ళ జనుల ముల్కీ భాషలకు ఇంతవరకే సరియైన స్థానము లేక వారి సభ్యత వారి విజ్ఞానము, కావలసిన రీతిగా అభివృద్ధి యగుట లేదు
బ్రిటిషిండియాలో పరభాషయగు ఇంగ్లీషులో విద్యా వ్యాపకము చేసిన 68 ఏండ్లకు “అరరే” ఇంతవరకు చేసిన వ్యయము, యత్నము శ్రమ, అంతయు వ్యర్ధమే" అని ప్రభుత్వమువారును, ప్రజలును గుర్తించిరి ఆ పద్దతి అస్వాభావికమనియు హానికరమనియు గుర్తించిరి
మేము పలుమారులు ఈ ముల్కీ భాషా సమస్యను గూర్చి వ్రాసినచో మేము ఉర్దూ ద్వేషులమని భావించువారు మాయెడ చాలా అన్యాయము చేసిన వారగుదురు. మన విద్యా విధానములో ఉర్దూకుండిన ప్రాముఖ్యతయైన దేశ