Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

218

గోలకొండ పత్రిక సంపాదకీయాలు

తెలిసిన సభ్యులకు అర్థము కానట్లు యితర భాషలలో కార్యక్రమము సాగించుట యెంత మాత్రము గాని తగదు!

మొత్తము మీద విశేషము లన్నియు ఒకసారి సింహావలోకనము చేసిన తర్వాత సిరిసిల్ల మహాసభకు ఆంధ్రోద్యమ చరిత్ర యందు వాస్తవమయిన ప్రాముఖ్యము నిచ్చునది - "ఆంధ్ర భాషా విజయము"న్ను దానికి మూలమయిన సంస్కరణోత్సాహుల విజయమున్ను అని చెప్పక తప్పదు ముందు ముందు యీ పక్షము అంతకంతకు ప్రబలమై ఆంధ్రోద్యమపు నావను వశపరచుకొన గల రోజు మాకు దూరమున నైనను స్పష్టముగా గోచరించుచున్నది