Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

216

గోలకొండ పత్రిక సంపాదకీయాలు

ఉర్దూ దినపత్రికలన్నియును ఆ వార్తలను ప్రకటించుటయేగాక ప్రశంసించను గూడ ప్రశంసించినవి ఇందుచే ఉర్దూ పత్రికలను మాత్రమే విశేషముగా చూచు అనేకులు పెద్దలు అధ్యక్షునికి తమ సంతోషమును తెలియబరచినట్లు వినుచున్నాము. ఆఖరుకు 'టైమ్స్ ఆఫ్ ఇండియా' పత్రికలో గూడ కొద్దియో గొప్పయో యీ సభ వార్త వచ్చినది కాబట్టి ఆంధ్రోద్యమ అంకురము నానా దిక్కుల కొమ్మలను వేయనారంభించినదన్నమాట!

ఈ సభకు రామణీయకమును ఆపాదించిన మరికొన్ని విశేషములలో వ్యాయామపు పోటీలును, సాంఘిక నాటకములును, ఆర్యసమాజము వారి వైదిక ధర్మ ప్రచారమును చేరి యున్నవి ప్రభుత్వము వారి వ్యవసాయ పరిశ్రమల శాఖల నవీనాభివృద్ధి ప్రదర్శనములును జీవరక్షా ప్రచారక మండలి వారి మ్యాజిక్ లాంతరు ప్రదర్శనములును ఖమ్మంలో వలెనే ఈ సభలోను జరిగినవి

మేము యిదివరకే తెల్పియున్నట్లు యీ సిరిసిల్ల సభకు విశేషత్వమును ఒనగూర్చు రెండంశములు ఏవనగా - 1 స్వయముగా ఉత్సాహముతో ఏర్పడి శ్రద్ధతో పని చేసిన ఆహ్వాన సంఘము లభించుట, 2 మన ఆంధ్రోద్యమ పితామహుడు అధ్యక్షుడగుట

ఇపుడు పైన చెప్పబడిన విశేషములే గాక ముఖ్యాతి ముఖ్యమయిన మరియొక అంశము పేర్కొన దగినది గలదు గత ఖమ్మం మహా సభలో యెవరో సనాతనులమని ప్రకటించుకొనుచు వివాహవయో నిర్ణయమునకు సంబంధించిన తీర్మానము మున్నగు రెండు మూడు సంఘ సంస్కరణపు తీర్మానములను తుదకు చర్చకైనను రానీయకుండ, పడగొట్టి యుండిరి వాటితో కూడ మహాసభకు సంబంధించిన నియమావళి (చిత్తు)కి కూడ దృష్టి దోషము తగిలెను ఈసారి సభలోనైనసు యీ నియమావళి గతి యేమగునో యేమో యని అనుకొనుచుండ, యే విధమయిన ఆటంకము లేకుండ అది ఆమోదించబడినది అది యెట్లన్నను నిరుడు సంఘ సంస్కరణ తీర్మానములు పడగొట్టబడినపుడు అనేకులు సంస్కరణ ఉత్సాహులు, ఎవరో తీర్మానములను పడగొట్టజూచుటయు, మీరు లొంగుటయునాయని నాయకులపై చాల కోపించి యుండిరి 1 ఇపుడా పక్షమువారు మొదటి విజయము పొందినారు. బాలికలకు 15 ఏండ్ల వయస్సు