ఈ పుట ఆమోదించబడ్డది
214
గోలకొండ పత్రిక సంపాదకీయాలు
78 ప్రాతవి (39 మసీబులు, 39 మహమ్మదీయేతరులవి) బాగు చేయించబడినవి. ఈ పని యంతయు ప్రభుత్వ వ్యయములతో జరిగినది పై సంఖ్యలవలన మన ప్రభుత్వము వారి నిష్పాక్షికత్వము తెలియుచున్నది
ముగింపు
మొత్తము మీద మేము పైన ఉల్లేఖించిన విధమున ప్రభుత్వము వారి నివేదిక బోధప్రదముగనున్నది విద్యావంతులగు దేశీయులు - ముఖ్యముగా ఇంగ్లీషు వచ్చినవారు - ఈ నివేదికను చదివి లాభము పొందవచ్చును ముందు నివేదికలు సకాలమునకు సత్వరముగా ప్రకటితములగునట్లు ఏర్పాటులు జరిపిన యీ నివేదికల విలువ యింకను హెచ్చగలదు.