Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సురవరం ప్రతాపరెడ్డి

209

చున్నది ప్రభుత్వము వారీ విషయములో శ్రద్ధ కలిగించుకొని విచారించి అందు నిజముగా ఆక్షేపణీయాంశములు వున్నవని నిశ్చయించిన, వెంటనే తగిన చర్య పుచ్చుకొందురని తలచుచున్నాము మరియు ఈ "తారేఖెహింద్" గ్రంధము మన రాష్ట్రంలోనన్ని పాఠశాలలందును ప్రైమరీ మొదలుకొని బి ఏ వరకును, అదే గ్రంధకర్తచే వ్రాయబడినదై, విద్యార్థులకు చదివింపబడుచున్నదని వినుచున్నాము. ఈ గ్రంధములలో ఏవేని ఆక్షేపణీయములో, ఏవేవి చరిత్ర విరుద్ధాంశములో, యేవేవి అనవసర ప్రసంగములో అట్టివన్నియు సమకూర్చుటకై యొక కమిటీని నిర్ణయించి బ్రిటిషిండియా, ఇంగ్లాండులలోని సుప్రసిద్ధ చరిత్రకారుల యభిప్రాయములను గైకొనవలెననియు సూచించుచున్నాము.