208
గోలకొండ పత్రిక సంపాదకీయాలు
వ్రాయుట కలదు తాళ్ళపాక వారి కవిత్వము కొంత మా పైత్యము కొంత అన్నట్లు ఏలనో కొందరు చరిత్రకారులు తమ రాగ ద్వేషములను దాచుకొనలేక గ్రంథస్థము చేసి ప్రకటించుకొనుచుందురు మన సర్ హైదర్ నవాజ్ జంగ్బ హద్దరు గారు ఇట్టి చరిత్రకారులను దృష్టియందుంచుకొనియే కాబోలు రెండు మూడు మారులు హెచ్చరించి యుండిరి. నవాబుగారు మన పాఠశాలలలో చెప్పబడు చరిత్రలు సరియైనవి కావనియు, హిందూ ముసల్మానుల ఐకమత్యమునకు అనుకూలించునవిగా వ్రాయు చరిత్రలే యుత్తమమైనవనియు నభిప్రాయమిచ్చు ఉపన్యాసములు ఇచ్చియుండిరి చరిత్రకారుడు తన యిష్టము వచ్చినట్లు గత గోష్ఠిని గురించి యభిప్రాయ మిచ్చుటకు స్వతంత్రుడే. కానీ ఆ అభిప్రాయములు పక్షపాతముతో కూడినవై యుండినవి యెవ్వరికి పనికివచ్చినను విద్యార్ధులకు మాత్రమే పనికిరావని మా యభిప్రాయము
మెక్ డొనాల్డుగారు, విదేశములో ఇంగ్లీషు, చరిత్రను గురించి యొకటి రెండే తప్పుడు వాక్యముల వ్రాసి బోధించుచుండినందున, ఆ ప్రభుత్వమునకు వ్రాయగా వెంటనే వారు ఆ ఆక్షేపణీయమగు వార్తలను తీసివేసి ముద్రించిరట ఇక్కార్యము ఉభయ దేశముల గౌరవమును హెచ్చింపవలెను
మన దేశములో నిప్పుడు విద్యార్థులకు బోధించు చరిత్రలు కొన్ని బాగుగా పరిశీలించి వ్రాయించవలసి యుండును నిజమైన విషయములు వ్రాయుటకు ఆటంకము లేదు కానీ అనవసరముగా హేళనము చేయుట, ఒక మతము వారికి ఉద్రేకము కలిగించుట, ఒక మతము వారికి అవమానము కలిగించుట, ఒక మతమును గురించి అనవసర విమర్శనము చేయుట, ఆ మత సిద్ధాంతములను వెక్కిరించుట, ఇట్టివి గల చరిత్రలు ఎంత కాలము మన యువకులకు నేర్పబడుచుండునో అంతవరకు దేశమందు ద్వేషములు, మనస్పర్థలు ప్రబలుచుండును
మన రాష్ట్రములో "తారీఖెహింద్" అను ఉర్దూ గ్రంథములోని కొన్ని భాగములను ఇటీవల వైదికాదర్శిలో ఎత్తి ప్రకటించినారు ఆ భాగములు కొందరికి గాని బహుళ జనులకు గాని ఆక్షేపణీయములు కావని తలంచినను, "వైదికాదర్శి" వంటి వారికి కొంత మందికి మనస్తాపము కలిగించినట్లు కనబడు