206
గోలకొండ పత్రిక సంపాదకీయాలు
గల భాగములు యిట్టి ఫక్కీనే సూచించును కాని ఆ కావ్యములలో అవి ప్రధానములుగ నెంచబడక ప్రధానమైన ఒక ఆత్మయుక్తమగు శరీరమునకు అలంకారములుగ నెంచబడినవి ఇదియే భేదము. ప్రాచీన ఫక్కిలో యేది అలంకార మాత్రముగా నుండెనొ అది పైన లక్షితమైన నూతన ఫక్కిలో శరీరమే యైనది. ఇట్టి లక్షణమును అనుసరించి రసవంతమగు కావ్యమును రచించుచు పోవుటలో ప్రాచీన సంప్రదాయ సిద్ధములగు నియమములు అడ్డము తగిలినప్పుడు ఆ నియమోల్లంఘనము తప్పదు.
నేడు భావ కవిత్వములు అనుబడునవి అనేకములు నూతన పక్కిని అవలంబించి యుండవచ్చును గాని అంత మాత్రముననే అవి గొప్ప కావ్యములని అందరు చెప్పవలెనని తాము అనుట లేదని సుబ్బారావుగారు అంగీకరించినారు రచయితలు తాము ఇది మంచి, యిది మంచిది ఆనుకొని రచించినారు నిజముగా మంచిదా కాదా యను నిర్ణయము సహృదయుల వంతు సహృదయులకు పెక్కురకు నేటి రచనలలో అనేకములు యింత కాలము వరకును రసహీనములుగనే కన్పడుచున్నవి. అది వాస్తవమే కాని నిజముగా కవులైన వారు దేనికి నెదరు కొని పోరాదు శాకుంతలము కాళిదాసుయొక్క మొదటి యత్నము కాదు ఉత్తర రామ చరితము భవభూతి యొక్క ప్రధమ రచన కాదు కొందరు కుకవుల రచనలు సహృదయుల శ్లాఘను బడయక పోవుట మంచి కవుల దోషము కాదు కాబట్టి క్రొత్త 'కవి భూషణుడు' చెప్పినట్లు నిజమైన కవి “కాలోహ్యయం నిరవధి ర్విపులాచ పృధ్వి ' అని తలచి ఋజు బుద్ధితో ఆత్మవంచన లేక తమ బుద్ధికి యుక్తమగు రచనల జేయుచుండవలసినదే!