ఈ పుట ఆమోదించబడ్డది
202
గోలకొండ పత్రిక సంపాదకీయాలు
నెల ఆఖరున దుగ్గాణియైనను మిగిలించుకొనలేనివారు వారు మొదటినుంచి తమ భవిష్యత్తు విషయమై తక్కువ ఖర్చుతో కొంచెము కూడబెట్టుకొను చుండిననేగాని అంత్య దినములలో అప్పులపాలు కాకుండా జీవించలేరు ఇన్ని కష్టముల మధ్య భక్తి ద్రవ్యరూపముననే వెల్లడి జేయుటయన వారికెంత కష్టమో యెవరికిని తెలియనిది కాదు. అట్టివారికి పైజెప్పబడిన రాజకీయ కార్యాలయ లేఖ ఉపశాంతికరముగా - సంతోషకరముగా అని చెప్పట లేదు - వుండ గలదు.
కాబట్టి మొత్తము మీద ప్రభుత్వోద్యోగులు, ఉద్యోగులు కాని వారు అనక ప్రతి నిజాం ప్రభు భక్తుడును తమ తమ శక్తి కొలది సంతోషముతో ప్రభువరేణ్యుని రజతోత్సవ నిధికి విరాళముల నీయవలసినదని కోరు యిట్టి లేఖను వెల్లడి చేసినందుకు రాజకీయ శాఖవారును ప్రభుత్వ ప్రకటనశాఖ వారును ప్రశంసనీయులనక తప్పదు