Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సురవరం ప్రతాపరెడ్డి

201

నట్లు, ఎమిరా తప్పించు కొనుటకు మార్గమే కనబడదు దేవుడా? అని చింతతో నిచ్చు విలువగల యువహారముతో సంతోషించరు.

అయితే ఒక సందర్భములో నిర్బంధము అందు చూపించికలిగిన కాకపోవచ్చును. ప్రభువరేణ్యుని రజతోత్సవ స్మారకముగా ఒక మంచి విద్యాలయముగాని లేక బీదలకు యెక్కువగ ఉపకరించు వైద్యశాలనుగాని లేక పనిచేయలేని కుంటి గ్రుడ్డి మొదలగు వికలాంగుల శరణాలయమును గాని స్థాపించుటకై నిధి ద్రవ్యము వెచ్చింపదలచినప్పుడు, అందుకు చాలినంత ద్రవ్యమును సమకూర్చుటకై నెలకు 100కి పైబడిన జీతము గల ప్రతి ప్రభుత్వోద్యోగి నుండి నిర్బంధముగా కొంత వసూలు చేసిన అంత బాధకము కాజాలదు. ఇక్కడనైనను పూర్తిగా నిర్బంధముకన్న, హృదయావర్జనమే మంచిది కాని నెలకు నూటి కంటె తక్కువ జీతము గల వారి నుండి ఒక నెల జీతములో పదవ వంతుకై ప్రార్థన యైనను పలుమారు చేయకుండుటయే మంచిదని దలంచెదము. ప్రార్ధనలో నేమి తప్పువున్న దని అడుగవచ్చును కాని పదేపదే ప్రార్థించుట యన ఒక విధముగా మోమోటమి రూపమయిన నిర్బంధమునకు అవకాశమిచ్చినట్లే యగును. తక్కువ జీతము గలవారు ప్రభువుగారి రజతోత్సవ నిధికి విరాళమును ఈయలేక పోయినందువల్ల వారికి ప్రభు భక్తి లేదనజాలము ఒక్కొక్కరి విషయములో యెక్కువ జీతము గలవానికంటే తక్కువ జీతము గలవానికే ప్రభు భక్తి యెక్కువ యుండవచ్చును కుచేలుడు నిత్య దరిద్రుడు. అతని చిన్ని ఉపహారం శ్రీకృష్ణునికి అపూర్వానందము నిచ్చినదని విందుము ఇదే రీతి యుండును గొప్ప మనస్సు గలవారలకు ధనిక దరిద్రతత్వ భేదము యెడ ప్రవృత్తి

ప్రతి మానవుడు మొట్టమొదట స్వార్థపరుడే స్వార్ధమయిన తరువాతనే గురువు, దేవుడు మొదలగు భక్తిమార్గముల వైపు మరలును బీదలన్నవారికెన్ని కష్టములుండునో, తనకు వచ్చు నెల జీతములో తన్నే ఆశ్రయించుకొనియున్నకుటుంబ పోషణమును చేసికొనజాలక తీరిక సమయములో సుఖమును కూడ పోగొట్టుకొని ఉప వృత్తులను కల్పించుకొని కష్టపడవలసినవారు, వారు ఇంత కష్టపడినను, సామాన్యమయిన అవసర ఖర్చు కంటె యెక్కువ చేయకున్నను,