ఈ పుట ఆమోదించబడ్డది
సురవరం ప్రతాపరెడ్డి
199
ప్రచారమనిన గిట్టదని యెవరు చెప్పినను ఆశ్చర్యమే కదా! అట్టి మాటను యెంత మాత్రము నమ్ముటకు వీలులేదు.
ఇక యిది ఆర్యమత మనిన సహింపజాలని యే బుద్ధిగల భీరువుచేతనో వ్రాయబడియుండ వలెను అందుచేత ఆర్య సమాజీయుల నిది భయపెట్టజాలదు
ఈ లేఖ జనులలో కొంత విస్మయమును కలిగించియుండుటచే దాని వాస్తవమును తత్సంబంధాధికారులు పరిశోధన చేసి వెల్లడిచేయుట యుక్తమని మా యభిప్రాయము
ఇదంతయు నెట్లున్నను ప్రభువునకు సర్వ మతములును సమానమేయను ఆదర్శముగల మ॥ఘ॥వ॥ నిజాం ప్రభువుగారి రాష్ట్రమున యితర మతములను దూషించక తమ మతముయొక్క ప్రాశస్త్యమును గూర్చి ప్రచారము చేయుచున్నంత కాలము ఆర్య సమాజీయులు భయపడ నక్కరలేదనియే మా విశ్వాసము