196
గోలకొండ పత్రిక సంపాదకీయాలు
సంఘమను సంస్థ యేర్పడి కార్యారంభమునకు గడంగుటయు, బ్రిటిషు ఆంధ్రదేశమున వెలువడుచున్న ఆంధ్ర వాఙ్మయము యొక్క వ్యాప్తి క్రమక్రమముగా హెచ్చగుచుండుటయు ప్రజలయందు కలుగుచున్న నూతన ప్రబోధమును విశదము చేయుచున్నవి
మన రాష్ట్రములో ప్రజాహిత కార్యాసక్తిని పెంపొందించుటకును, ఆధునికములగు వివిదోద్యమములను గూర్చిన విజ్ఞానమును రాష్ట్రమునందెల్లెడల వ్యాపింపజేయుటకును మన రాష్ట్రము యొక్క ప్రజా సమస్యలను గూర్చిన యదార్ధ జ్ఞానమును గ్రామస్ధులు ద్వారముల కడకు గొనిపోవుటయు ఎంతయో యవసరమని మానిశ్చితాభిప్రాయము ఈ యంశములను దృష్టియందుంచియే గోలకొండ పత్రికను దిన పత్రికగా మార్చుటకై ప్రభుత్వము వారి యాజ్ఞ కోరబడియుండెను. కానియది లభించియుండలేడు నిజాం రాష్ట్రాంధ్రుల సంఖ్య డెబ్బది లక్షలు. మొత్తము రాష్ట్ర జన సంఖ్యలో వీరివంతు నూటికి 45 చొప్పున నగుచున్నది. ఇంత గొప్ప సంఖ్య ఈ రాష్ట్రమునందలి మరి యే భాష వారికిని లేదు మహాఘనత వహించిన నిజాం ప్రభుత్వము వారు రాష్ట్రములోని ప్రజలలో ఆంధ్రులకు గల సంఖ్యా ప్రాధాన్యతను వారి యోగ్యతా విశేషములను బాగుగ నెరుగుదురు. కనుక యిట్టి ముఖ్య ప్రవా భాగమునకు ఒక దిన పత్రిక యత్యవసరమని ప్రభుత్వము వారు విశ్వసించియేయున్నారు. కావున కొలది కాలములోనే యాంధ్ర దిన పత్రిక మన రాష్ట్రమునకు లభించగలదని మనము ఆశించవచ్చును. అట్టి సుదినము త్వరలో చూడగల్గుదుము గాక!
"గోలకొండ పత్రిక" మన రాష్ట్రమున నొకటే యగు తెలుగు వార్తాపత్రిక యని పైన సూచించి యున్నాము ఈ కారణమువలన ఆంధ్ర సోదర సోదరీమణు లందరికిని యిది ముద్దు బిడ్డ వివిధ శాఖల వారికిని వివిధ భావముల వారికిని సనాతనులకును, నవీనులకును, స్త్రీలకును, పురుషులకును, వేయేల, యందరికిని తమ న్యాయ్యాభి ప్రాయముల ప్రకటించుటకు ఈ పత్రిక యందు తావుండక తప్పదు కొన్ని హృదయములలో నీ విషయమున సందియము బాధించుచున్నట్లు తెలియుచున్నందున మేము విష్పష్టముగా చెప్పదలచిన విషయమేమన, మా పత్రిక యొక్క విధానము సంకుచితము కాదు. వ్యక్తుల యభి