Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

194

గోలకొండ పత్రిక సంపాదకీయాలు

గ్రామములం దంతటను విశ్వాసము హెచ్చు ఈ వైద్యమునకు యూనానికిచ్చినట్టి సహాయమైన ఇచ్చుట చాలా అవసరము. బ్రిటీషిండియాలో సహిత మిప్పుడీ వైద్యమునకు చాల ఆదరణము కలుగుచున్నది. అనేక మునిసిపాలిటీలు చాల సాయపడుచున్నవి.

మన రాష్ట్రములో ముఖ్యముగా విద్యాధికులైన వారు ఈ సుల్తాను బజారు వైద్యాలయమును చూచి తీరవలెను. అచటి వైద్యులకు మంచి ప్రోత్సాహమీయవలెను వారి చేతనే అవసరమైన తావులందు చికిత్సలు చేయించవలెను ప్రభుత్వ సహాయమిప్పించుటకును గట్టి ప్రయత్నము చేయవలెను.