Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సురవరం ప్రతాపరెడ్డి

193

ఫలితము తక్కువ పాశ్చాత్య వైద్యులు బాగుచేయని జాడ్యములు ఆయుర్వేద వైద్యులు బాగుచేసినట్లు ఏ నగరములో విచారించినను గొప్ప గొప్ప డాక్టర్లే ఒప్పుకొనగలరు జర్మను డాక్టరు ఆయుర్వేదమును చూచి ఆశ్చర్యపడినాడు ఏమి ఇంతవొక, ఇంత గుణము ఇంత శ్రేష్టత దీనికెట్లబ్బెనని .................... అభిప్రాయపడినారు

అట్టి వైద్యమునకు, వైద్యశాలలు లేవు, వైద్యాలయములు లేవు ఉన్నవానికి ప్రభుత్వాదరణముసున్న. మన రాష్ట్రములో యూనానికి గత సవత్సరము 20 లక్షలు ప్రభుత్వము వారిచ్చినారని బొంబాయి ముసాల్మాను లభినందించి సభలో తీర్మానములు చేసిన వార్త ప్రకటించి యుంటిమి. కాని ఆయుర్వేద వైద్యమట్టి నోమునోచుకొనలేదు. అనేక తాలూకాలలో యునాని వైద్యాలయములు కలపు హకీములకు మంచిసాయము కలదు నగరములో యూనాని వైద్యశాల కలదు కాని అనేక సంవత్సరముల నుండి ఆయుర్వేద వైద్యమునకు కనిష్ఠ మొక్క కళాశాల అయిన యుండరాదాయని ప్రజలు ప్రార్ధించుచున్నారు. కాని యింతవరకు రూపము దాల్చలేదు. ఆ ఆయుర్వేదమును ఉర్దులో సంగ్రహించి వ్రాయించి యునానీ వైద్యాలయములోనే ఒక పాఠముగా నేర్పాటు చేయనెంచుచున్నారని ఒక వార్త వినియుంటిమి. అదే నిజమైన అట్లు చేయుటకన్న ఊరకుండుట మేలు, చరక శుశ్రుతములను ధన్వంతరినివాగ్భటాది ప్రచండ గ్రంధములను సుమారు ఒక వేయివరకు వైద్య గ్రంధరాజములు సంస్కృతములో తెలుగులో నుండగా వాటిసారము ఉర్దూలో వ్రాయుట బ్రహ్మదేవుని తరమా! అతని పుట్టించిన వాని తరమా! ఆయుర్వేద గ్రంధములను సంస్కృతములో దేశ భాషల ద్వారానే నేర్పవలసి యుండును

ఇప్పుడు చెప్పబోవున దేమన సుల్తాను బజారులో శ్రీ యువరాజు గారి సిద్ధహస్తముచే ప్రారంభింపబడి నెలకు సుమారు 4000 మందికి విశేషముగా నుచితముగా మందిచ్చి జాతిమత వివక్షత లేక సేవ జేయుచుండిన వైద్యమండలివారిని ఎంత ప్రశంసించినను అతిశయోక్తి కానేరదు. వారు చేయుచున్న కృషి ప్రభుత్వ దృష్టి నాకర్షింపవలసి యున్నది యూనాని కన్న ఆయుర్వేదములకే

GPS_13 (1)