192
గోలకొండ పత్రిక సంపాదకీయాలు
మంఖుడు అను బ్రాహ్మణునిచే సుశ్రుతము అరబ్బీలోనికి తర్జుమా చేయబడెను హరూనుబ్రషీదు ఖలీఫా కొక పర్యాయము చాలయపాయకరమగు జాడ్యము సంభవింపగా ఈ మంఖుడే ఎవరి చేతను కానట్టి యీ రోగ చికిత్సను చేసి అతనికి బాగుచేసెను ఆపై ఈ మంఖుని మీద ఖలీఫాకు అత్యంతాభిమానము కలిగెను. వెంటనే మంఖుడు దవాఖాన సర్కారే అలీ పైన డైరక్టరుగా నేర్పాటు చేయబడెను. హిందూ నక్షత్ర శాస్త్రము, అల్జీబ్రా, వైద్యము చాలా శ్రద్ధతో అరబ్బులు ఈ ఖలీఫా కాలములో నేర్చుకొనిరి మరియు అనేక హిందూ పండితులను ప్రార్ధించి వారిని తమ దేశములో నిలిపికొని ఖలీఫాలు తమ బోధకులనుగా ఏర్పాటు చేసుకొనిరి ముసాల్మాను విద్యార్థులును హిందూ స్ధానములోని వైద్యాలయములలో హిందూవులవద్ద చాలా శ్రద్ధతో భక్తితో వైద్యశాస్త్రమునభ్యసించుటకు పుట్టలు పుట్టలుగా నేటేట వచ్చుచుండిరని సర్- ప్రపుల్ల చంద్రరాయ్ గారు తమ గ్రంధములో వ్రాసినారు ఈనాడు మన తెలివి తక్కువ తనముచే యూరోపులో నాలుగేండ్లుండి నాలుగు ముక్కలు చదువుకొని వచ్చిన విద్య పరిక్షుణ్ణమైనదని మనమనుకొన్నట్లుగాక ఆనాడు అరబీ ఫారశీక దేశములందలి ముసాల్మానులు చాల భ క్తితో శ్రద్ధతో ఆతురతతో హిందువుల వద్దకు వచ్చి నేర్చికొని పోవుచుండిరి
సులేమాన్ అను యాత్రికుడు విజయనగర సామ్రూజ్యమును జూచి విజయనగర పట్టణ రాజములో అనేకులగు అరబ్బులు వైద్యాలయములో పని నేర్చుటనుచూచి వర్ణించియుండెను ఇట్లు ఆయుర్వేదమునకును యూనానికిని చాల సన్నిహిత సంబంధముండెడిది కాని కొందరు దుష్టరాజుల మూలమున క్రమేణ ఈ సంబంధము దూరమయ్యెను అన్యోన్య ప్రేమలు మాసిపోయెను. హిందూముసాల్మానులలో ద్వేషములు ప్రబలెను సుమారు 300 సంవత్సరముల నుండి ఈ రెండును వేరువేరు మార్గముల బడెను
ఆయుర్వేద వైద్యము చాల చౌకయైనట్టిది పాశ్చాత్య వైద్యము మనకు తగనిది. అది మనకు సరిపడనిది చలి దేశముల వారికి పనికివచ్చినది ఉష్ణ దేశముల వారికంతగా పనికిరాదు. పై విదేశముల నుండి దిగుమతి అయిన మందులు చాలఖరీదు అవే మనదేశములో సిద్ధమైన చౌకగా నుండును. అయినను