ఈ పుట ఆమోదించబడ్డది
190
గోలకొండ పత్రిక సంపాదకీయాలు
ఇంత గొప్పవ్యయముతో 275000 యెకరములకు నీటిపాఱుదల గావించగల గొప్ప ప్రాజక్టు నిర్మాణము గావించినందుకు, తగినంత లాభము వ్యవసాయాభివృద్ధి ప్రజలు పొందునపుడు ప్రాజక్టుకారకులు తాము పూర్తిగా చరితార్థులమైతిమని తృప్తిజెంద వచ్చును ఈ ప్రాజక్టు ప్రాంతములో చెఱకును విస్తారముగా పైరుచేసి, ఆ చెఱకు నంతటిని ఈ రాష్ట్రములోనే బెల్లము చక్కెరచేసి అమ్ముటకు సౌకర్యములున్నచో యీ ప్రాజక్టువల్ల గొప్ప లాభముండును అని అలీనవాజ్‌జంగ్‌గారు తలచుచున్నారు ఎట్లయినను యీ ప్రాజెక్టుకు కారకులగు వారికి దానివలన రాష్ట్రము యొక్క ద్రవ్యోత్పత్తి స్పష్టముగా యెక్కువగునంతవరకు, ప్రాజెక్టుపని పూర్తి అయినదని తలచకుండ ఆయా విషయము లన్నింటియందు నిపుణులగు వారి సలహాలతో పనిచేయునట్టి బాధ్యతాధికారములను యిచ్చి చూచుట మంచిదని మాతలంపు.