Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

188

గోలకొండ పత్రిక సంపాదకీయాలు

దానికి వెంటనె శ్రార్ధకర్మ చేయవలసినదే ప్రజలను తృప్తి పరుపగల్గి వారి ఆదరణ పొందు స్థితిలోనుండు పత్రికలకు ప్రభుత్వ సహాయ మనవసరమని వేరె చెప్పబనిలేదు ఇట్లు రెండు విధముల పత్రికలకును సహాయము అనవసరము

ఇపుడు ఇంకో భయమేమన, మన ప్రభుత్వమువారి ఔదార్యము వలన బైటి పత్రికలకు యెన్నింటికి మన రాష్ట్ర ద్రవ్యము పోవుచున్నదోయనునది మన ప్రకటన శాఖ వారి ద్వారా ప్రభుత్వము వారు ఏ పత్రికల కెంత సహాయము చేయునది, బయటి పత్రికలకు గూడ సాయము జరుగుచున్నదా యను విషయములను తెలుపగలరేని తెలుప ప్రార్థితులు ఇట్టి సహాయమువలన కేవలం పత్రికాధిపతుల ఇనుపపెట్టెలు నిండుటయు ప్రజల ద్రవ్యము నష్టమగుటయు వివిధ పత్రికల మధ్య నీర్ష్య ప్రబలుటయు సంభవించునని మనవి చేయు చున్నాము.