Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సురవరం ప్రతాపరెడ్డి

183

మహాసభలో ప్రవేశ పెట్టబడలేదని జనులందరు చాడుకొనుచున్నారు - తీర్మానముల లోని విషయములు యిష్టము కాని వారు యెవరో మహాసభలోనికి వచ్చి ప్రతి కూల వాదము చేసి తమ అభిప్రాయములను మహాసభా జనుల కందరికి వెల్లడి చేసి, తీర్మానముల నోడించుటకు యెందుకు పూనుకోలేదు. మహాసభా నిర్వాహకులు నిస్సంశయముగ ప్రతికూల వాదములను, తమ కిష్టముగాకున్నను గౌరవించు వారేనే? నిజముగా ఆ తీర్మానములు కూడనివని నిరూపించదలచిన వారు అడిగినచో, వారివాదములు సభలో జనులందరికిని స్పష్టము చేయుటకు అవకాశము లభించి యుండునే! ఈ ప్రతికూలురు సదరు తీర్మానములను మహాసభలో ప్రవేశ పెట్టనీయ వద్దని మహాసభా నిర్వాహకులను బలవంతము చేసిరా ? బలవంతము చేసినను తీర్మానములను ప్రవేశ పెట్ట దలచినవారు గాని సభా నిర్వాహకులుగాని అట్టి దానికి లొంగి యుందురా? ఇట్లే ఎవరో కొందరు కొందరు వచ్చి తమ కీ తీర్మానము యిష్టము కాదు, యిది ప్రవేశ పెట్ట వద్దు, అది ప్రవేశ పెట్టవద్దు అని అడిగినచో అట్టి ప్రతివారి మాటను మహాసభా నిర్వాహకులు గాని తీర్మానములను ప్రవేశ పెట్ట దలచువారుగాని పాటింతురని మేము నమ్మజాలము. తీర్మానములు ప్రవేశ పెట్టబడియె యుండును ప్రతికూలురు గౌరవము కలవారైనచో తమ వాదమును స్పష్టపరచియో నీచులైనచో తుంటరితనము చేసియో తమ ప్రాతి కూల్యము దెల్పియే యుందురు తుంటరితనమునకు భయపడి మహాసభా నిర్వాహకులు తీర్మాన ప్రవేశమును మానుకొని యుండరు తుంటరితనము జర్గునేమో యను భయమున్నప్పుడు ముందుగానే అట్టిది జరుగకుండ ప్రభుత్వాధికారులు రక్షణము కోరబడి యుండును రాజభక్తియు ప్రభుత్వాజ్ఞల యందు విధేయతయు ప్రకృతిగా గల మన రాష్ట్రీయులలో ప్రభుత్వాధికారుల ఆజ్ఞకు విరుద్ధముగా తుంటరి తనమును శరణువేడు వారు లేనేలేరని మా విశ్వాసము.

ఇంతదూరము విచారించగా యిపుడు వ్యాపించియున్న జనశ్రుతిలో బలము లేకుండదు అని ఊహించవలసి వచ్చునేమో కొందరు మొదట తాము ఖమ్మము పురములో మహాసభయె జరుగగూడదని తాలుక్దారు సాహెబు మొదలగు అధికారులకు దరఖాస్తులను పంపుకొనియు, ఆ దరఖాస్తులు త్రోసివేయబడిన పిమ్మట చిత్తు తీర్మానములలోని నిమ్న జాత్యుద్ధరణము, వివాహసంస్కరణము, సాత్విక పూజా విధానములను గూర్చిన తీర్మానములను మహాసభలో ప్రవేశపెట్టబడ