సురవరం ప్రతాపరెడ్డి
179
కష్టం” ఈ వాక్యములవలన నా పత్రికకు తన ఉత్తర సర్కారు భాషయే నిజమైన తెనుగు భాషగను తక్కిన ప్రాంతముల తెనుగు భాష పైశాచ తుల్యముగను గనపడినట్లు దోచకమానదు కాని ఆ జయంతి పత్రిక నెవ్వరును మీరు హైద్రాబాదు భాషను వెక్కిరించుచున్నారు గాన మీరు నిజామాంధ్రులు ఉత్తర సర్కారాంధ్రులు అను భేద భావమును ప్రచారము చేయుచున్నారని యాక్షేపించిన పాపమున బోలేదు
శ్రీ శేషాద్రి రమణ కవులు "నిజాం రాష్ట్ర కవులు” అను నొక పెద్ద వ్యాసమును వ్రాసి పూర్వ కవుల పట్టీనె తయారుచేసిరి వారిపై యే నిందారోపణ చేయలేదేలకో! దత్తమండల కవుల పట్టీలను వ్రాసి యా కవుల ప్రశంసించిన వారు కలరు వారిది గూడ తప్పగునా ?
ఒకవేళ మేము బ్రిటిషండియాలో కవులు పూజ్యమనియో లేక తెలివి కలిగిన కవి గాని మెదడు కలిగిన పండితుడుగాని అక్కడ లేడు అనియో లేక యే విధమైన నిందారూపకమగు వాక్యములనో పలికిన మమ్మాక్షేపించుట కడుంగడు సమంజసమైయుండెడిది మేము బ్రిటిషు ఆంధ్రుల నెన్నడును నిరసింపము. వారిపై మాకు ప్రేమ మెండు మొత్తమాంధ్ర జాతిపై యితర జాతి వాడెవ్వడేని నిందా రూపకముగా పలికిన మా కలము ఖడ్గమై పనిచేయుటలో వెనుదీయదు
ఇంత దూరము మా మిత్రులగు వెంకట రమణయ్యగారికి తెలుపుట యే మన మేము ద్వేష బుద్ధితో నీ కార్యమునకు దిగలేదు. నిజాము రాష్ట్రము కపులకు పత్రికాధారము బ్రిటీషు ఇండియాలోనున్నట్లు లేనందున ననేకులు మారుమూలలందు తమ కీర్తిని నడచికొనియున్నారు అట్టివారి కవితా స్రవంతిని బయటి కుప్పొంగజేసి నిజాము రాష్ట్రాంధ్రుల యొక్క వాడిపోవుచున్న ప్రతిభాలతకు నూతన జీవకళ నాపాదించుటయే మా ముఖ్య కృషి - స్వకీయాభి మానమును పరకీయ ద్వేషముగా నిర్వచించుట అన్యాయము ఈ సమాధానమును మా పాఠకులు గమనించి మాకు బ్రిటిషాంధ్రులపై భేదముగాని, ద్వేషముగాని, దురభిప్రాయముగాని లేదని తెలుసుకొందురు గాక.