Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

178

గోలకొండ పత్రిక సంపాదకీయాలు

యెన్ని యో సంవత్సరములనుండి భారతి మున్నగు బ్రిటిషిండియా పత్రికలు నడుపబడినను నా పత్రికలలో నొక్క నిజాంరాష్ట్రీయుని వ్యాసమైనను గాంచుట లేదు. అయితే వ్యాసములు పంపువారు లేకున్నవారేమి చేయుదురని చెప్పవచ్చును మంచిమంచి వ్యాసములను పేరొందినవారు పంపుటయు నయ్యవి ప్రకటింపబడక పోవుటయు మేమెఱిగిన విషయము కావున నీ కారణముచేతను నీరాష్ట్ర కవులకు ప్రోత్సాహము కలిగించుట చాలయవసరము

ముఖ్యముగా నాక్షేపకులొక్క విషయమును గమనింపవలసినది నేను వృద్ధియైన నా ప్రక్క ఇంటివానికి నష్టమని తలపకూడదు మా రాష్ట్రముపై మాకభిమానముండిన మాకితరులపై ద్వేషమున్నదని వాదింపగూడదు మా తల్లిని మేము ప్రేమించిన నితరుల తల్లులను నసహ్యముతో జూచితిమని తగవు పడకూడదు ప్రతి దేశమునను, తుదకు ప్రతి గ్రామమునను స్థానికాభిమానము మొదలు తర్వాత యిది వైశాల్యమందు హెచ్చుచు పోవును. కొంతకాలము క్రిందట నొక నెల్లూరుపత్రికలో కొందరు "నెల్లూరు గొప్పవారు" అను పలుమారు వ్యాసమున వ్రాసిరి "ఏమయ్యా మీరిట్లు వ్రాయుటచే నెల్లూరాంధ్రులు నెల్లూరేత రాంధ్రులు అను భేదము జూపుచున్నారని యా పత్రిక నెవ్వరును నా క్షేపింప లేదు " మొన్ననె ఆంధ్రభూమిలో "పడమటిసీమ కవులు" అను నొక వ్యాస ముండెను అదే పత్రికలో నాళం కృష్ణారావుగారు తూర్పు ఆంధ్రులకును పడమటి యాంధ్రులకునుగల భేదమును చాలా తీవ్రముగా (అయినను మెచ్చుకొను విధముగా) వర్ణించిన భాగమును ముద్రించిరి అది భేదభావము కల్పించునది కాదాయని యెవ్వరును ప్రశ్నింపకపోయిరి వావిలికొలనువారికి ఒంటిమిట్టపై యభిమానముండుటచేతనే కదా అందరు పోతన ఓరుగల్లు కవియేయని నొక్కి చెప్పినను “కాదంటె కాదు అతడు నా ఒంటిమిట్టవాడే" యని కట్టలు కట్టలుగా వ్రాసిరి.

ఇప్పుడంతరించిన 'జయంతి' యను పత్రికలోనిట్లు సంపాదకులు వ్రాసిరి. "తెనుగు భాష కృష్ణా, గుంటూరు, గోదావరి, విశాఖపట్నం జిల్లాలలో మాట్లేడేది అట్లాంటిది ఇతర భాషలతో కలసివుండే ప్రదేశాలల్లో ఈ మార్పునందు అంత సానుభూతివుండదు బరంపురము, హైద్రాబాదు, చిత్తూరు ఇటువంటి ఇతర భాషా సంపర్కం కలట్టి చోట్ల వాళ్ళకి గ్రాంథికభాష నిలబెట్టుకోటమో