తృతీయాంధ్ర మహాసభ
21 - 6 - 1934
సుమారు పదునేను సంవత్సరముల క్రింద ఈ రాష్ట్రమున నారంభమైన ఆంధ్రోద్యమము క్రమక్రమముగా వికాసము పొంది ఆంధ్ర మహాసభ రూపమున నిలుకడగాంచి, మొట్టమొదట మెదకు జిల్లాలోని జోగిపేట యందు ఆంధ్ర జనాశయములు వెలువడెను. ఈ మహాసభకు ప్రభుత్వము వారి వ్యవసాయ శాఖ నుండియు, పశు చికిత్సాశాఖ నుండియు, సహకారశాఖ నుండియు ప్రతినిధులువచ్చి తోడ్పడి ఆంధ్రుల ఆశయముల యెడ నభిమానమును ప్రదర్శించిరి తరువాత ద్వీతీయాంధ్ర మహాసభ నల్లగొండ జిల్లాలోని దేవరకొండ యందు వైభవముగా జరిగెను. దీనికి పై ప్రభుత్వ శాఖలవారే కాక పారిశ్రామిక శాఖాధికారులు కూడ వచ్చి యుపన్యసించియు, ప్రదర్శనములు జరిపియు సహాయ మొనర్చిరి. ఈ రెండు మహాసభలందును ఆంధ్ర జిల్లాల నుండి జనులు వచ్చి పాల్గొనిరి. పేక్షకుల సంఖ్య రెండువేలుండెననిన అందతిశయోక్తి లేదు.
మూడవ వత్సరమున మహాసభ 1341 ఫర్వర్థి నెలలో విఖ్యాతమగు జటప్రోలు సంస్థానపు రాజధాని నగరమున జరుప నిశ్చయింపబడియుండెను. కాని నీ దైవిక కారణములో ప్రేరేపించినందున మన ప్రభుత్వము వారు దీని కంగీకారమొసగక పోయిరి. అంతేగాక ఎచ్చటను ఈ మహాసభ జరగ వలసిన పనిలేదని ఆజ్ఞ ఇచ్చిరి 70 లక్షల ఆంధ్ర పుత్రుల యభ్యుదయమునకిట్టి ఆజ్ఞ ఆటంకముగానుండునని తలచి, ఆంధ్ర జన సంఘము (మహాసభ యొక్క స్థాయి సంఘము) వారు ప్రభుత్వము వారికి వివరములదెల్పి మరెచ్చటనైనను సభ జరుపననుజ్ఞు కోరిరి కాని రాజకీయముల చర్చించెదరను అనుమానముచే ప్రభుత్వమువారు సెలవియ్య నిరాకరించిరి తరువాత పోలీసుశాఖా మంత్రివర్యులు కేంద్ర సంఘ కార్యదర్శి విన్నపమును వినిన మీదట రాజకీయములలో ప్రవేశించమని నమ్మకమునకుగాను కార్యదర్శిగా నుండియు ఇతర సమావేశకుల నుండియు నగదు జమానతుకోరిరి. అట్లు జమానతు ఇచ్చుటకు శక్తి కలిగి