Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

174

గోలకొండ పత్రిక సంపాదకీయాలు

నిద్రలో పడెను దాని నిపుడు మరల కళకళలాడునట్లు చేయుటకై అచ్చటి యువకులు పూనుకొనినారు వారు తయారు చేసి అమలుపరచగోరునట్టి క్రొత్త విధానమువల్ల మంచి లాభము గలుగగలదు - ఈ విధానము స్థలాంతరమున సూచింపబడి యున్నది మన రాష్ట్రమందు అటువంటి మార్గములో ప్రయత్నములు చేయబడుచో త్వరలో ఇచట అనేక చరిద్రుల కుటుంబములకు వృత్తులేర్పడ గలవు మన జిల్లాలలో అనేక స్థలములందు యిప్పటికిని కొన్ని కళలు తమ స్థానమును నిలుపుకొనియున్నవి వీటికి తగు ప్రోత్సాహమున్నచో అవి చక్కగా వృద్ధిగాంచ గలవు స్వదేశీయాభిమానము రాష్ట్రీయ ప్రజలలో ఎక్కువగా వ్యాపించిననె గాని రాష్ట్రీయులు తయారు చేయు వస్తువులకు మంచి నమ్మకమైన మార్కెట్టు ఏర్పడజాలదు తీవ్రమైన ఉత్సాహముతోను పట్టుదలతోను నిరంతరకృషి సల్పిననే గాని ప్రజలలో తమ రాష్ట్రపు వస్తువులు అను అభిమానము వ్యాపించదు. దానికి తగిన సమయము ఎట్లు అనగా ముల్కి ఉద్యమము యిపుడు క్రొత్త ఉడుకులోనున్నది. ఇది యొక విధముగా "రాష్ట్రీయ" భావమును రంగమునకు తెచ్చినది మన రాష్ట్రీయ నాయకులు ఈ అవకాశమును పోగొట్టుకొనక రాష్ట్రము యొక్క ఆర్థిక సౌష్ఠవాభివృద్ధికి తగిన స్వదేశి ప్రచార విధానమును తీర్మానించుకొని త్వరలో కార్యరంగమున దిగెదరు గాక