ఈ పుట ఆమోదించబడ్డది
సురవరం ప్రతాపరెడ్డి
171
తెలియుటలేదు. మన రాష్ట్రమునకు గూడ శాసనసభ ఒకటి ఉన్నది గదా! మన ప్రభుత్వము వారు క్రొత్త పన్ను విషయమై శాసనసభ వారి ఆమోదమును బడసిరా? అధమ పక్షము వారి యభిప్రాయమునైనను గైకొనిరా? ఈ విషయములు తెలియవచ్చుటలేదు ప్రభుత్వము వారు పన్ను అమలు పరచుటకు ఆజ్ఞ నిచ్చు సమయమును ఈ విషయములను ఒక ప్రకటనమూలముగానైనను తెలియజేసి యుండలేదు
రాష్ట్రీయుల అగ్గిపెట్టెలపై ఎంత పన్ను విధింపబడుచున్నదో ఇతర రాజ్యములనుండి దిగుమతి యగు వాటిపై అంతపన్ను విధించుటచే మన రాష్ట్ర మందలి పరిశ్రమకు భయము తప్పునని ప్రభుత్వమువారు తలచినట్లున్నది ఇది చూడగాబీదవారికి ధనము పుట్టని ఈ కాలములో ఆదాయము హెచ్చు అగుటకు తగినంత తోడ్పడకున్నను వారి ఖర్చుకు మాత్రము మరికొంత చేర్చబడినట్లైనది.