170
గోలకొండ పత్రిక సంపాదకీయాలు
తేది నుండి మన రాష్ట్రమందు అమలుపరుపబడుచున్నట్టియు పన్ను రేటు బ్రిటిషు ఇండియాలో, అమలు పరుపబడుటకు ముందే, శాసనసభ వారిచే మార్చబడినది. ఇండియా ప్రభుత్వము వారును ఈ మార్పు సంగీకరించినారు ఈ మార్పు ప్రకారము అగ్గిపెట్టె 1కి 40 పుల్లలు గల అగ్గిపెట్టెలపై 144 కి ఒక రూపాయి వంతునను, ఈ లెక్కన 60 పుల్లల పెట్టెలపై వాటికి తగినట్లును 80 పుల్లలు పెట్టెలపై వాటికి తగినట్లును పన్ను అమలు పరుచబడును. ఈ విధముగా నున్న అమలుపరచిన తర్వాత గూడ కల్దారు మూడు పాయీల కొక నిప్పుపెట్టె బజారులో అమ్ముడు పోవునట్టిది ఉండగలదని ఆశింపబడు చున్నది ఈ మార్పు అగ్గిపెట్టెల పరిశ్రమ యొక్క అభివృద్ధి క్రొత్త పన్ను వలన తగ్గకుండునందులకై చేయబడినది. ఈ మార్చిన రేట్లవల్లనే ప్రభుత్వము వారును తమకు ఎక్కువ ఆదాయము వచ్చునని ఆశించిరి
మన రాష్ట్రమందలి అగ్గిపెట్టెల పరిశ్రమ బ్రిటిషు యిండియాలో దానికంటే ఎక్కువ అభివృద్ధి జెందినదికాదు గదా? అట్టి సందర్భములో బ్రిటిషు యిండియాలో పరిశ్రమ అంగీకరింపజాలని పన్నును మన రాష్ట్రీయ పరిశ్రమ మాత్రము భరింప జాలునా? నిప్పు పెట్టె ప్రతి బీదవాడును ఉపయోగించునట్టి వస్తువు. ఈ కొత్త పన్ను వలన ధనవంతులగు కొద్దిమందికి ఏ బాధయు అనిపించకున్నను అనేకులగు బీదలకు ఖర్చు హెచ్చును పన్నువలన నేర్పడు కొత్త పరిస్థితులు వారికి భారముగా నుండవలయును మన ప్రభుత్వమువారు తమ తొందరలో కొనువారినిగాని అమ్మువారినిగాని మనస్సులో నుంచుకొన నట్లే యున్నది
బరోడా ప్రభుత్వమువారిని జూడుడు. వారును అగ్గిపెట్టెలపై పన్ను విధించుటకు నిశ్చయించినను ఇండియూ ప్రభుత్వము వారు ఏ రేటును అమలు పరచిన ఆ రేటునే తమ రాజ్యములో అమలు పరచవలెనని వారు ఉత్తరువు చేసిరి పుదుక్కోట సంస్థానములో ప్రభుత్వము వారు పన్నును అమలు పరచుటకు ముందు తమ శాసనసభవారి అభిప్రాయమును గైకొనిరి ఈ ఏప్రిల్ నెల 19 వ తేదీనాడు పుదుక్కోట శాసనసభవారు అగ్గిపెట్టెలపై పన్నును అమలు పరచుటకు అంగీకరించిరి. పన్ను ఏ రేటు ప్రకారము అమలుపరుచబడునో