ఇతర సంస్థానములు
30 - 4 - 1934
ఇంతకు పూర్వము మేము మన రాష్ట్ర మందు తయారుచేయబడు అగ్గిపెట్టెలపైన మనప్రభుత్వము వారు విధించిన పన్నును గూర్చి మా అభిప్రాయము నిచ్చుచు దానివలన ఇప్పటికిని ప్రారంభ దశలోనే యున్నదన దగిన మన రాష్ట్రీయమైన అగ్గిపుల్లల పరిశ్రమ యొక్క అభివృద్ధికి ఈ పన్ను గొప్ప ఆటంకమగునని చెప్పి "వీలుండిన వెంటనే ఈ నూతన శుల్కములను రద్దు చేయవలయు"నని కోరి యుంటిమి ఈ పన్నును విధించు విషయమున ఇతర సంస్థానములను చూడుడు మన సంస్థానమును చూడుడు మన సంస్థానమువారు ఒక విధముగా అనవసరమైన తొందర జూపిరని మాకు తోచుచున్నది. ఎట్లనగా ఈ అగ్గిపెట్టెల పైని యక్సైజు పన్నును అమలు పరచుట యందు మన ప్రభుత్వము వారు మొట్టమొదటి వారైరి అంతేకాక పన్ను మొట్టమొదట బ్రిటిషు యిండియా శాసనసభలో ఇండియా ప్రభుత్వమునందలి ఆర్థిక సభ్యుడు కోరినంత విధింపబడినది.
సంస్థాన ప్రభుత్వములు తమ రాజ్యములందు తయారుచేయబడు అగ్గిపెట్టెలపై పన్ను అమలు పరుచవలసి వచ్చినది ఇండియా ప్రభుత్వమువారు కోరుట వలననే ఇండియా ప్రభుత్వము ఇట్లు కోరుటకు కారణము వారు బ్రిటిషు యిండియాలో తయారుచేయబడు అగ్గిపెట్టెలపై పన్ను వసూలు చేయదలచుటయు సంస్థానములలో ఇటువంటి పన్ను లేనిచో బ్రిటిషు ఇండియా వారు అగ్గిపెట్టెల పరిశ్రమలను సంస్థానములలో స్థాపించుకొని పన్నును తప్పించు కొందురను భయమున్ను అయియున్నది ఈ కారణమును తృప్తి పరచుటకు ఇండియా ప్రభుత్వము వారు తమ రాజ్యమందు తయారుచేయబడు ఆగ్గిపెట్టెలపై ఎంత పన్ను విధింతురో చూచి అంత మాత్రమే విధించిన చాలదా? మొదట ఇండియా ప్రభుత్వము యొక్క ఆర్ధిక సభ్యుడు కోరి యుండునట్టియు, ఈ ఏప్రిలు 1 వ.