ఈ పుట ఆమోదించబడ్డది
168
గోలకొండ పత్రిక సంపాదకీయాలు
ముగా నుపయోగపడుటకు వ్యవహారభాష హిందీగా నుండవలెనను మతము. అనగా ఈ రాష్ట్రమున సైతము వివిధ భాషలవారికి సామాన్య వ్యవహార భాషగా నుండుటకు ఉర్దుకంటె హిందీయే ఎక్కువ తగినదని ముల్కీ ఉద్యమము యొక్క అభిప్రాయము. ఎటు జూచినను రాష్ట్రీయులలో పదిమందికిని ఎక్కువ లాభకరము కాని ఉర్దులో మాత్రమే అన్ని స్థలములలోను విద్యనేర్పు ఏర్పాటు వలన వృధా ధనవ్యయము తప్ప మరియొక లాభముండదు.
జవోరా సంస్థాన ప్రభువు చేసిన మార్పు - అది నిజమేయైనచో - ప్రశంసనీయము కాదు. మన ప్రభుత్వమువారును ఎంత త్వరలో మాతృభాష ద్వారా విద్య నేర్పించు ఏర్పాటుల అవసర ప్రాముఖ్యములను గ్రహింపగలరో అంత మంచిది.