Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిజాం రాష్ట్ర వాణిజ్యము

4 - 9 - 1933

1341 ఫసలీలో నిజాం రాష్ట్రముయొక్క ఎగుమతి దిగుమతు లెట్లుండినది వివరించు ప్రభుత్వ పరిశీలనము మాత్రము మాకు పంపబడినది ఆ పరిశీలనమై కొంత వ్యాఖ్యానము గావించుటకు ముందు మేమొక మొఱను తెలుపవలసి యున్నది. పరిశీలన మొదలునుబట్టి చూడగానే ఆ పరిశీలనకు ముందు ఎగుమతి దిగుమతుల సంఖ్యలను మాత్రము ఇచ్చు నివేదిక ఒకటి యుండవలెనని గోచరింపగలదు. అట్టి నివేదిక ఏదియు మాక్కు పంపబడలేదాయెను. ఇట్లే మ. ఘ. వ. నిజాం ప్రభుత్వము నందు మాకు నివేదికలను పంపక ప్రభుత్వ పరిశీలనను మాత్రమే పంపునట్టి శాఖలు ఇంకను కొన్ని కలవు. ఎట్లో మాకు లెక్కల శాఖవారి నివేదికయు సహకార శాఖవారి నివేదికయు చేరినవి. ఇదివరకు అర్షశాఖా నివేదిక విషయమునకూడ ఈ సంగతినే మేము మొఱపెట్టి యుంటిమి

ఇంక ప్రస్తుతాంశమునకు వచ్చుదము నివేదన సంవత్సరములో-పరిశీలన సంవత్సరములో ననుటయే మాకు సరియని తలచెదము. వాణిజ్యము అంతకుముందు సంవత్సరముకంటె సుమారు నూటికి 3 లేక 4 లెక్కన తగ్గెను ఆర్ధిక దుస్థితి - అనగా డబ్బు పుట్టకపోవుట అందువల్ల ధరలు తగ్గుట అనులక్షణములు గల పరిస్థితి - ప్రపంచమునంతయు బాధించినటులే నిజాము రాష్ట్రమును గూడ బాధించి యుండినందువల్ల ఈ తగ్గుదల ఫలితమయ్యెను ఎగుమతులకంటె దిగుమతులు 3 కోట్ల 22 లక్షల 47 వేల రూపాయలు హెచ్చుట మన రాష్ట్రమునకు అనుకూల విషయముగ నుండవచ్చును

కొన్ని ముఖ్యమగు వస్తువుల విషయమున ఎగుమతి దిగుమతుల సంఖ్యలు సూచించు విషయములను పరిశీలింతము మన రాష్ట్రపు ఎగుమతులలో ముఖ్యమైనవి ప్రత్తియు, వేరు సెనగయు అవియేమో పడిపోయినవి 1340 ఫసలీలలో 1454079 మనుగులది మాత్రము ఎగుమతియైనది వేరుసెనగల ఎగుమతులు