158
గోలకొండ పత్రిక సంపాదకీయాలు
ములు ఈ విషయమును అన్నిటికంటె ఎక్కువ స్పష్టముగా సూచించుచున్నవి ఆ తీర్మానములలో నేమి కలదు? సంస్థాన ప్రజలు 8 కోట్లమంది యున్నను అఖిలభారత సమాహరము (ఆలిండియా ఫెడరేషను)ను గూర్చిన చర్చలలో వారి ప్రతినిధులకు తావీయలేదను కోపమును ఒక తీర్మానమును తెలుపుచున్నది. సంస్థాన ప్రజల ప్రతినిధులను శాసనసభలలో చేర్చుటకు ఏర్పాటులేనిది గనుక తెల్లకాగితపు సమాహార (ఫెడరలు) పద్ధతి యిష్టము కాదని యింకొక తీర్మానము చెప్పుచున్నది మరికొన్ని తీర్మానములలో వ్యక్తి స్వాతంత్ర్యము, సంఘముగ చేరుటకు హక్కు మొదలగు హక్కులు కోరబడినవి మరియొక తీర్మానము భావి రాజ్యాంగమందు ప్రభుత్వమనునది ప్రజల సొత్తుగా నుండవలెనని చెప్పుచున్నది. తీర్మానములలో సంస్థాన ప్రజల యనుమాన బుద్ధిని తెలుపునట్టివి కొన్ని గలపు ఆ అనుమాన మేమన సంస్థానాధిపతులకు తమకు బాధ్యతాయుత ప్రభుత్వము నిచ్చు కోరికలేదు అనునది అందుకై ప్రతి సంస్థానము ఫెడరేషనులో విధిగా చేరవలసినట్లు నియమింపబడవలెననియు, అట్లు చేరు ప్రతి సంస్థానములోను బాధ్యతాయుత ప్రభుత్వము విధిగా స్థాపింపబడవలెననియు మహాసభవారు తీర్మానించిరి ఇంతజేసినను ఆఖరుకు చర్యలలో సంస్థానాధిపులు ప్రజా స్వాతంత్ర్యమునకు భంగము కలిగించిన గతియేమి అనుసంశయముతో, ఫెడరలు చట్టముల నుల్లఘించిన సంస్థానాధిపతులపై ఫెడరలు కోర్టులో దావా చేయుటకు సంస్థానాధికారులకు హక్కుండ వలెననియు, ఎక్కడ దుష్పరిపాలనము జరుగునో ఆ సంస్థానము యొక్క ప్రజలు కోరిన వెంటనే అచటి అధిపతిని సార్వభౌముడు తొలగింపవలెననియు మహాసభ తీర్మానించెను. ఈ తీర్మానములను సంస్థాన ప్రజల కోరికలను సాధించుటకై ఇండియాలోను ఇంగ్లాండులోను ప్రచారము చేయబడవలెనను తీర్మానమును సంస్థాన ప్రజలకు తమ అధిపతులపై విశ్వాసమెట్లు నశించుచున్నదో తెలుపుచున్నది
సంస్థానప్రజల యనుమానము రెండు విధములుగ నున్నది. పై జెప్పినట్టిది మొదటిది. ఇక రెండవదానిని గూర్చి విమర్శించెదము. తమ కోరికలను సాధించుకొనుటకై సంస్థాన ప్రజలు పరప్రభువు ( బ్రిటిషు ప్రభుత్వము )ను, అది శరణుజొచ్చుచున్నారు ఇద్దరికి అనుకూల్యము లేనప్పుడు - పిల్లులు కొట్లాడుటచే కోతివలె - మూడవ వానికి లాభమను నీతికూడ వారి హృదయములను బాధించు చున్నది. ఆఖరుకు సంస్థానాధిపతులను, సంస్థాన ప్రజలను కూడ తక్కువ జేసి ఎవరు శరణముగా వేడబడుచున్నారో వారి వారి లాభమును జూచుకొని ఊరకున్నచో గతియేమి ? కనుక సంస్థాన ప్రజల యభిమతము లేనిదే వారి